రివ్యూ: లవ్ టుడే

చిన్న సినిమాగా వచ్చిన ‘లవ్ టుడే’ తమిళంలో సంచలన విజయం సాధించింది. కోమలి ఫేమ్ ప్రదీప్ రంగనాథన్‌ నటుడిగా, దర్శకుడిగా తీసిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం ఐదు కోట్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా దాదాపు 70 కోట్లు వసుళూ చేసింది. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం చాలామంది ప్ర‌య‌త్నించారు.కానీ… త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒప్పుకోలేదు. అందుకే డ‌బ్బింగ్ రూపంలో దిల్ రాజు అదే టైటిల్ తో తెలుగులో విడుదల చేశారు. తమిళంలో యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంది ? చిన్న సినిమాగా వచ్చి అంత పెద్ద విజయం సాధించగల కంటెంట్ లవ్ టుడేలో ఏముంది ?

ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్‌) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాడు. నిఖిత (ఇవానా) మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఈ ఇద్దరూ ప్రేమలో వుంటారు. ప్రదీప్ అక్క దివ్య (రవీనారవి)కి డాక్టర్ యోగి (యోగి బాబు) తో పెళ్లి కుదురుతుంది. అక్క పెళ్లి అయిన తర్వాత తన ప్రేమ విషయం నిఖిత ఇంట్లో మాట్లాడతానని చెప్తాడు ప్రదీప్. అయితే ఇంతలో ప్రేమ సంగతి నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్ ) కి తెలుస్తుంది. ప్రదీప్ ని వెంటనే పిలిపిస్తాడు. నిఖిత, ప్రదీప్ పెళ్లికి పచ్చజెండా ఊపుతాడు. అయితే ఒక కండీషన్… ప్రదీప్, నిఖిత ఇద్దరూ ఒక రోజంతా ఒకరి ఫోను మరొకరు వాడాలి. వేణు శాస్త్రీ కండీషన్ కి ఇద్దరూ ఓకే చెబుతారు. ఫోన్లు మార్చుకుంటారు. అలా ఫోన్లు మార్చుకున్న వారి జీవితాలు ఎలా మారాయి ? ఎన్ని మలుపులు తిరిగాయి ? వారి మధ్య ఎలాంటి రహస్యాలు వున్నాయి ? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా ? అనేది మిగతా కథ.

మనిషి గౌరవం, మర్యాద, నిజాయితీ, పరువు.. ఇవన్నీ ఇపుడు ఒక సెల్ ఫోన్ లో వున్నాయి. ఆ ఫోన్ ని శరీరంలో ఒక అవయవం కంటే జాగ్రత్తగా చుసుకుంటున్నాం. అందులో అన్నీ ఎఫైర్లు, సీక్రెట్లు ఉంటాయని కాదు. ప్రపంచానికి తెలియని ఒక వ్యక్తిత్వం అందులో వుంటుంది. అది బయటపడితే మనిషి నిజస్వరూపం తెలుస్తుంది. బయటికి ఎంత గొప్పగా చెప్పుకున్నా.. తన నిజ స్వారూపాన్ని బయటపెట్టాలని అనుకోడు మనిషి. అలా మనిషి నిజస్వరూపానికి దర్పణమైన ఫోన్ మరొకరి చేతిలో రోజంతా వుంటే ఏం జరుగుతుంది..? ఎన్ని అనర్ధాలు వస్తాయి? సరిగ్గా ఇదే పాయింట్ ని పట్టుకున్నాడు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌.

ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. ప్రదీప్, నిఖితల పరిచయ సన్నివేశాలు, వేణు శాస్త్రి, ఫ్రెండ్స్ గ్యాంగ్ .. ఇలా అందరినీ త్వరగా పరిచయం చేసేసి.. మెయిన్ పాయింట్ ని ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే వేణు శాస్త్రి ఫోన్లు మార్చుకునే కండీషన్ పెడతాడో .. అక్కడి నుంచి ఫన్ రైడ్ మొదలౌతుంది. ఫోన్ తిరిగి తెచ్చుకోవడానికి వేసిన ప్లాన్స్, సి టైప్ చార్జర్ కోసం ప్రదీప్ పడే తంటాలు, నిఖిత పాత బాయ్ ఫ్రెండ్‌ వాయిస్ మెసేజులు, బుజ్జికన్నా డీజే పాట .. అన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. నిజానికి ఫస్ట్ హాఫ్ నే ఒక మంచి ఫన్ మూవీ చూసేసిన ఫీలింగ్ ఇచ్చేస్తుంది.

ఫస్ట్ హాఫ్ లో నిఖిత తప్పులు కనిపిస్తే సెకండ్ హాఫ్ లో ప్రదీప్ అడ్డంగా దొరికిపోతాడు. తన పాత గర్ల్ ఫ్రెండ్స్‌ తో చేసిన చాటింగులన్నీ బయటపడతాయి. దీంతో ప్రదీప్ డిఫెన్స్ లోకి వెళ్తాడు. అయితే దర్శకుడు ఇక్కడే ఒక తెలివైన ప్లే ని ఓపెన్ చేస్తాడు. అక్క పెళ్లి రూపంలో యోగి బాబు ట్రాక్ ని ఓపెన్ చేసి దాన్ని కూడా ఒక ఫోన్ చుట్టూ జరిగే కథగా మార్చడం ద‌ర్శ‌కుడిగా త‌న‌ ప్రతిభకి అద్దం పడుతుంది. ఒక్క క్షణం కూడా ఫోన్ విడిచిపెట్టని యోగిబాబు పాత్రని ఫన్ తో పాటు ఎమోషనల్ గా కూడా డిజైన్ చేయడం ఆకట్టుకుంటుంది. అయితే తొలి సగంతో పోల్చుకుంటే రెండో సగంలో వినోదం మోతాదు త‌గ్గింది. చాలా వరకూ కథనం సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. మొబైల్ వాడకంలోని ప్రమాదాలని కాసేపు చర్చించినట్లు కనిపిస్తుంది.

అయితే ఈ కథని ఒక పిల్లాడు మామిడి టెంకని భూమిలో పాతిన సీన్ తో ఓపెన్ చేస్తారు. అది కథలో చాలాసార్లు వస్తుంటుంది. దాన్ని క్లైమాక్స్ లో ‘నమ్మకం’ తో కాయిన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ”ఒక విత్తనం నాటామంటే అది మొలకెత్తి మహా మహా వృక్షం అవుతుందనే నమ్మకం ఉంచాలి. అంతేకాని రోజు తీసిన దాన్ని చేతిలో పట్టుకొని ఇంకా మొలకెత్తలేదని బాధపడిపోకూడదు. ఈ మాటలని ప్రదీప్ నిఖితల ప్రేమకి అన్వయించి చెప్పడం ఆకట్టుకుంటుంది. అటు యోగి బాబు పాత్ర రూపంలో కూడా మరో ఫీల్ గుడ్ టచ్ వుంటుంది. ఈ మూడు కలసి కథకు మంచి ముగింపు ఇచ్చాయి.

ప్రదీప్ రంగనాథన్‌ దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా తన ప్రతిభని చాటాడు. చాలా సహజంగా వున్నాడు. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునే కామన్ మెన్ లా కనిపించాడు. తను ప్రేమించిన అమ్మాయి రహస్యాలు తెలుస్తున్నప్పుడు నిజాయితీగా ప్రేమించిన ఓ ప్రేమికుడు ఎలా ఫీలౌతాడనేది అద్భుతంగా చేసి చూపించాడు. తన హావభావాలు చాలా లవ్లీగా వున్నాయి. తప్పు చేశానని తల్లి దగ్గర మదనపడే సన్నివేశంలో తను కన్నీరు పెట్టుకొనే సీన్‌ చాలా సహజంగా వుంటుంది. ఈ చిత్రానికి కథ ఒక బలమైతే ప్రదీప్ నటన మరో బలం. నిఖిత పాత్రలో చేసిన ఇవానాకి మంచి మార్కులు పడతాయి. తన తండ్రి దగ్గర ప్రదీప్ ఎలా ఉండాలో అని చెప్పే పెద్ద డైలాగ్ కు థియేటర్స్ లో విజల్స్ పడతాయి. అలాగే తను ఏ తప్పు చేయలేదని ఫోన్ లో ఏడ్చే సన్నివేశంతో చాలా చోట్ల ఆమె నటన మెప్పిస్తుంది. యోగి బాబు మరోసారి ఆకట్టుకున్నాడు. ఆ పాత్రని కథలో భాగం చేసిన తీరు బావుంది. రాధిక, సత్యరాజ్ తమ అనుభవం చూపించారు. మిగతా నటీనటులు పరిధిమేర చేశారు.

నిర్మాణ విలువలు బావున్నాయి. కథకు కావాల్సిన ఖర్చు చేశారు. కెమెరాపనితనం ఆకట్టుకుంది. ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం చక్కగా కుదిరింది. బుజ్జికన్నా డీజే పాట హిలేరియస్ గా వుంది. తెలుగు డైలాగ్స్ ని చాలా అప్డేట్ గా రాశారు. ”జంబలకిడి జారు మిఠాయి” లాంటి వైరల్ మీమ్ ని కూడా డైలాగ్ గా మార్చేడం థియేటర్స్ లో నవ్వులు పూయించింది. దర్శకుడు ప్రదీప్ అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ని వినోదాత్మకంగా అందించడంలో విజయం సాధించాడు. వీకెండ్ లో కాసేపు సరదాగా నవ్వుకోవడానికి లవ్ టుడే మంచి ఆప్షన్.

ఫినిషింగ్ ట‌చ్‌: యూత్ స్పెష‌ల్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో కేసీఆర్ రోల్‌లో కేటీఆర్ !

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ...

ఎన్నికల్లో పోటీపై ఆశలు పెంచుకుంటున్న అలీ !

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన...

సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్ !

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తిరుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నేతల్ని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. వీరిలో కొంత మంది నామినేటెడ్...

విజయ్, దిల్ రాజు పై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కాన్సిల్ !

విజయ్ దేవరకొండ, పరశురాం, దిల్ రాజు సినిమా ప్రకటన వచ్చింది. విజయ్, పరశురాం ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో ఇది క్రేజీ కాంబినేషన్ అయ్యింది. అయితే ఈ కాంబినేషన్ లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close