హై-రైజ్ అపార్ట్మెంట్లు ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారాయి. యాభై , అరవై అంతస్తుల అపార్టుమెంట్లు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఫ్లాట్ కొనాలంటే కనీసం పదిహేను అంతస్తు పైనే ఉండాలని కోరుకుంటున్నారు. మరి దిగువ అంతస్తుల్లో ఎవరు కొంటారు ?. హై రైజ్ ప్రాజెక్టుల్లో దిగువ అంతస్తుల ఫ్లాట్లు కొనడం వల్ల ప్రయోజనం ఏమిటి ?
దిగువ అంతస్తుల ఫ్లాట్లు సాధారణంగా ఎత్తైన అంతస్తుల కంటే 10-20 శాతం తక్కువ ధరలో లభిస్తాయి. బిల్డప్ తో బేరం ఆడితే.. దాదాపుగా 30 శాతం తక్కువకే కొనుగోలు చేయవచ్చు. దిగువ అంతస్తులు వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలకు అనుకూలం. ఎలివేటర్ ఆగిపోయిన సందర్భాల్లో మెట్ల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. ఎత్తైన అంతస్తులతో పోలిస్తే, దిగువ అంతస్తుల ఫ్లాట్లకు ఎలివేటర్ వినియోగం తక్కువ, దీనివల్ల నెలవారీ మెయింటెనెన్స్ తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో దిగువ అంతస్తుల నుంచి త్వరగా బయటకు రావచ్చు . గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్లు తరచుగా గార్డెన్, ప్లే ఏరియాలకు సమీపంలో ఉంటాయి, ఇది పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న కుటుంబాలకు ఆకర్షణీయంగా ఉంటుంది.
అయితే సమస్యలు ఉండవని కాదు . ఎత్తైన అంతస్తులతో పోలిస్తే, దిగువ అంతస్తుల నుంచి నగర దృశ్యాలు, శుభ్రమైన గాలి అందుబాటులో ఉండవు. రీసేల్ విలువ తక్కువ: దిగువ అంతస్తుల ఫ్లాట్లు రీసేల్ లేదా రెంటల్ మార్కెట్లో తక్కువ డిమాండ్‌ను కలిగి ఉంటాయి. దిగువ అంతస్తుల ఫ్లాట్లు బడ్జెట్లో ఉండే కుటుంబాలకు, వృద్ధులకు అనువైనవి. కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉంటే పై అంతస్తులకే ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంత పెద్ద అపార్టుమెంట్ లో కొనాలనుకున్నప్పుడు పైనే కావాలనుకుంటారు కానీ.. కింద ఎందుకని ఎక్కువ మంది అభిప్రాయం.