హైదరాబాద్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఆకాశ హర్మ్యాల వైపు ఉంది. అందులో నివసించడం లగ్జరీగా భావిస్తున్నారు. వాటిలో ప్లాట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెడీ టూ ఆక్యుపై ఇళ్లు చాలా మందికి అందుబాటులో లేవు . ఉన్నా అభిరుచులకు తగ్గట్లుగా లేవు. అందుకే ఎక్కువ మంది పునాదులు పడిన ఇళ్లను బుక్ చేసుకుంటున్నారు. మరి వారికి చెప్పిన సమయానికి కంపెనీలు డెలివరీ ఇస్తున్నాయా?
పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ ముఖ్యం. పేరు ముఖ్యం. చెప్పిన సమయానికి ప్రాజెక్ట్ ఇవ్వకపోతే తర్వాత కస్టమర్లు నమ్మకం కోల్పోతారు. అందుకే
హైదరాబాద్లో బాగా పేరున్న రియల్ కంపెనీలు సమయానికి ప్రాజెక్టులను అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కంపెనీలు నాణ్యత, పారదర్శకత, కస్టమర్ సంతృప్తిపై దృష్టి సారిస్తున్నాయి. తమ ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నామని చెబుతున్నాయి. చాలాకంపెనీ ఎప్పటికప్పుడు ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి కన్ స్ట్రక్షన్ పురోగతిని తెలియచేస్తున్నాయి.
తెలంగాణలో RERA అమలు కారణంగా డెవలపర్లు ప్రాజెక్ట్ డెలివరీ టైమ్లైన్లను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్-సర్టిఫికేషన్ సిస్టమ్ వంటి విధానాలు ప్రాజెక్ట్ అనుమతులను వేగవంతం చేసి, నిర్మాణ ప్రక్రియలను సులభతరం చేస్తున్నాయి. అయితే కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రం ఆలస్యం తప్పడం లేదు. కొన్ని ప్రాజెక్టులు 6 నుండి 12 నెలల వరకు ఆలస్యమవుతున్నట్లు కొంత మంది సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి మిడ్ లెవల్ బిల్డర్ల ప్రాజెక్టులే.
హైదరాబాద్లో పెద్ద-స్థాయి ప్రాజెక్ట్ ఆలస్యాల గురించి ప్రతికూల ఫీడ్బ్యాక్ లేదని, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలపర్లు డెలివరీలో మెరుగ్గా ఉన్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.