హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీ, హైరైజ్ అపార్ట్మెంట్ల డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఇంటి కొనుగోలుదారులు మెయింటెనెన్స్ ఛార్జీలపై మరింత దృష్టి సారిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌస్, 24/7 సెక్యూరిటీ వంటి ఎమినిటీస్ నిర్వహణకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతున్నాయి.
హైరైజ్ అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ ఛార్జీలు సాధారణంగా పర్ స్క్వేర్ ఫుట్ ఆధారంగా లెక్కిస్తారు. ఇది నెలకు రూ.2 నుంచి ₹రూ.5 వరకు ఉంటుంది. ఉదాహరణకు, 1,200 చదరపు అడుగుల 2BHK ఫ్లాట్‌కు నెలవారీ ఖర్చు 3,600 నుంచి రూ. 6,000 వరకు పడుతుంది. కొన్ని సొసైటీలు ఫిక్స్డ్ ఛార్జ్ లేదా హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తాయి.
హైదరాబాద్‌లో సాధారణ గేటెడ్ కమ్యూనిటీలలో నెలవారీ మెయింటెనెన్స్ రూ.1,500 నుంచి రూ. 6,000 వరకు ఉంటుంది. అయితే గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, హైటెక్ సిటీ వంటి ప్రీమియం ప్రాంతాల్లోని లగ్జరీ హైరైజ్ ప్రాజెక్టుల్లో ఇది రూ.5,000 నుంచి రూ.15,000 లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.
ఈ మెయింటెనెన్స్ ఛార్జీల్లో సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్, గార్డెనింగ్, లిఫ్ట్ మరియు జనరేటర్ నిర్వహణ, పూల్-జిమ్ క్లీనింగ్, కామన్ ఏరియా లైటింగ్, స్టాఫ్ సాలరీలు , ఇన్సూరెన్స్ ఖర్చులు కవర్ అవుతాయి. అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టుల్లో స్కైవాక్, EV చార్జింగ్ స్టేషన్లు, హెలీప్యాడ్ వంటి అదనపు ఎమినిటీస్ ఉంటే ఖర్చు మరింత పెరుగుతుంది.
ఫ్లాట్ కొనుగోలు సమయంలో ఒక్కసారి చెల్లించే కార్పస్ లేదా సింకింగ్ ఫండ్ రూ. 1-2 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎమినిటీస్ మేజర్ రిపేర్లు, పెయింటింగ్ వంటి పనులకు ఉపయోగపడుతుంది.


