“మా” విందులు – బం‌డ్ల గణేష్ చిందులు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కోసం టాలీవుడ్‌లో హడావుడి ప్రారంభమయింది. గెట్ టు గెదర్ లాంటిపార్టీలు రెండు వర్గాలు ఇవ్వడం ప్రారంభించాయి. మొదటి నుంచి మా అధ్యక్ష పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ సభ్యులందరికీ పార్టీ ఏర్పాటు చేసింది. భోజనాలు చేస్తూ మాట్లాడుకుందాం రమ్మని సభ్యులకుభారీ ఎత్తున ఆహ్వానాలు పంపారు. నిజానికి రెండు రోజుల ముందుగా ప్రకాష్ రాజ్ మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఏర్పాటు చేసిన ఓ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాగుతారు.. తింటారు అందులో తప్పేముందని వెటకారంగా మాట్లాడారు.

ఇప్పుడు ఆయనే అలాంటి పార్టీని ఏర్పాటు చేశారు. ఇదంతా రాజకీయం అనుకునేంతలో వీరికి పోటిగా బండ్ల గణేష్ కూడా రంగంలోకి దిగారు. అయితే ఇలా పార్టీలు ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారేమో కానీ అసలు పార్టీ కల్చర్‌పైనే విమర్శలు ప్రారంభిచారు. కరోనా టైంలో అందర్నీ ఒక దగ్గరకు చేర్చడం మంచిది కాదని ఓట్లు అడగాలనుకుంటే ఫోన్లలో అడగాలని పిలుపునిచ్చారు. బండ్ల గణేష్ మొదట ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉన్నారు. తర్వాత ఆయనను తొలగించి జీవితా రాజశేఖర్ కు చోటిచ్చారు.

దీనిపై బండ్ల గణేష్ అసంతృప్తికి గురై తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎవరేమన్నా పోటీ చేస్తానని సభ్యులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విందులపై తన వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేశారు. వచ్చే నెల పదో తేదీన మా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇంకా మంచు విష్ణు ప్యానెల్ ను ప్రకటించలేదు. అయితే ఆ వర్గం తరపున ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎక్కువ లీడ్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: మూడు ముక్క‌లాట‌

ద‌స‌రా సంద‌ర్భంగా టాలీవుడ్ కొత్త సినిమాలతో క‌ళ‌క‌ళ‌లాడింది. మ‌హాస‌ముద్రం ఫ్లాప్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఓకే అనిపించుకుంది. పెళ్లి సంద‌డి బోర్ కొట్టించినా, కొన్ని ఏరియాల్లో అనూహ్య‌మైన వ‌సూళ్ల‌ని రాబ‌ట్టుకుంది. ఈ...

నెటిజన్స్ డిమాండ్: ఇతరుల తల్లులను తిట్టిన నేతలపై కూడా జగన్ చర్యలు తీసుకోవాలి

తాజాగా పట్టాభి వ్యాఖ్యల కారణం గా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న జగడం ప్రజల కి వి‌స్మయం కలిగిస్తోంది. పోలీసుల సంస్మరణ దినం సందర్భం గా ముఖ్య మంత్రి జగన్ కూడా ఇదే...

ద‌ర్శ‌కుల‌కూ బాకీ ప‌డ్డాడా?

ఇటీవ‌ల యువ నిర్మాత మ‌హేష్ కోనేరు గుండె పోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ మృతితో.. టాలీవుడ్ షాక్ కి గురైంది. ఓర‌కంగా... చాలామంది గుండెలు కూడా ఉలిక్కిప‌డిన‌ట్టైంది. సాధార‌ణంగా...

మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని పదుల సంఖ్యలో ఫిర్యాదులు !

మంచు మోహన్ బాబుపై పలికిన ఓ డైలాగ్ వివాదాస్పదమయింది. ఆయనపై రెండు తెలుగు రాష్ట్రాల సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మొదట అనంతపురం జిల్లాలో ఓ యాదవ సంఘం నేత పోలీసులకు...

HOT NEWS

[X] Close
[X] Close