సిక్స్త్ సెన్స్… నాలుగో సీజన్ షురూ !!

ఎంటర్ టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలిసిన “సిక్స్త్ సెన్స్” సరికొత్తగా  నాలుగో సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. గత మూడు సీజన్లుగా విభిన్నమైన అంశాల కలయికగా వచ్చిన ఈ షో ఇప్పుడు మరింత విలక్షణంగా ముస్తాబైంది.

మెస్మరైజ్ చేసే కొత్త లుక్.. షో లో వినోదాన్ని పండించే కంటెస్టెంట్స్… షో నిర్వహణలో ఓంకార్ ఇచ్చే కిక్ .. సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బంచులకొద్దీ పంచులు వేసే ఆది, గ్లామరస్ స్టార్ యాంకర్ అనసూయ.. ఇంకా బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సిక్స్త్ సెన్స్ సీజన్ 4 కి  వచ్చిన  ఆ నలుగురు కంటెస్టెంట్స్ సోహెల్, మహబూబ్, అరియనా, హారిక..  మొదటి వారం చేసిన సందడి; స్టార్ ప్రెజెంటర్ ఓంకార్ కొత్త స్టైల్ – వినోదాన్ని కొత్తగా నిర్వచించబోతోంది. రానున్న ఎపిసోడ్స్ లో ఊహించని కంటెస్టెంట్స్ ఎందరో ఈ వేదిక పైన హంగామా చేయబోతున్నారు.

సిక్స్త్ సెన్స్ ని మూడు సీజన్లను విజయవంతంగా ఇంటరెస్టింగ్ గా తనదైన శైలిలో నిర్వహిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఓంకార్ ఈ నాలుగో సీజన్లో ఓ కొత్త పంధాలో షోని ఓ కంప్లీట్ ప్యాకేజిలా అందిస్తున్నారు. ఇంతకు ముందు సీజన్స్ లో వున్న ఫార్ములాని కొనసాగిస్తూనే కొత్త రౌండ్స్ ని కూడా పరిచయం చేయబోతున్నారు.

పార్టిసిపెంట్స్ భావోద్వేగాలను తన ఆటకు అనుగుణంగా మార్చి, ఏం జరుగుతోందో తెలియని స్థితికి తీసుకెళ్లి మళ్ళీ ఓ నిర్ణయానికి వచ్చేలా చేయడం గత సీజన్స్ లో చూసాం. ఈ నాలుగో సీజన్లో ఆట స్థాయి నెక్స్ట్ లెవెల్ లో చూడబోతున్నారు ప్రేక్షకులు.

ఈ వారాంతం లో (జూన్ 12,13) మొదలుకాబోతున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 ప్రతి శనివారం, ఆదివారం ఆటలో కొత్త కొత్త మలుపులు, ఆటని నడిపించడంలో కొత్త కొత్త పద్ధతులను ప్రేక్షకులు చూడబోతున్నారు.

“సిక్స్త్ సెన్స్… నాలుగో సీజన్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/s2tAqaPJGKA.

Content Produced by Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close