ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు చాలా సార్లు బహిరంగ వేదికలపై హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కూడా చిన్నారులు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించడం లేదు. అయినా కొంత మంది కీచకులు మాత్రం తగ్గడం లేదు. సమాజంలో చీడపురుగుల్లా వీరు ఎప్పుడూ బయటపడుతూనే ఉన్నారు.
తాజాగా మదనపల్లి పట్టణం నీరు గట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కామాంధుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు. ఎదురింటిలో ఉండే బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లిన కులవర్ధన్.. లైంగిక దాడి చేశాడు. తర్వాత హత్యచేసి డ్రమ్ములో పెట్టాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఈ ఘటన మదనపల్లెలో సంచలనం సృష్టించింది. బాలిక తల్లిదండ్రులకు చంద్రబాబు, హోంమంత్రి ఫోన్ లో ధైర్యం చెప్పారు. న్యాయం చేస్తామన్నారు.
ఈ క్రమంలో పారిపోయిన కులవర్ధన్ .. దొరికితే వదిలి పెట్టరన్న ఉద్దేశంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది తునిలో ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్న బాలికపై ఓ వృద్ధుడు చేసిన దురాగతం విషయం బయటకు తెలిసిన తర్వాత అతనికి బతికే అర్హత లేదని ఎక్కువ మంది అనుకున్నారు. అలా అతను కూడా అనుకున్నాడేమో కానీ..,పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో …. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు పశ్చాత్తాపంతోనే.. అవమానాలను భరించలేకనో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2018లో దాచేపల్లిలో ఓ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో నిందిడుతు తర్వాత అడవిలో ఉరి వేసుకుని చనిపోయాడు. తర్వతా 2024లో అనకాపల్లి బాలికని హత్య చేసిన వ్యక్తి పురుగు మందు తాగి పొలాల్లో మరణించాడు. జూన్ లో కడపలో 3 ఏళ్ళ చిన్నారిని రేప్ చేసిన వాడు, మైలవరం డ్యాంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
