కరోనా టెస్టింగ్ కిట్స్ మేడిన్ ఏపీ..!

కరోనా పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ కీలకమైన ముందడుగు వేసింది. ఇప్పటి వరకూ వైరస్ టెస్టింగ్ కిట్స్ కోసం… దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు.. ఏపీలోనే టెస్టింగ్ కిట్స్ తయారవుతున్నాయి. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో తయారైన కరోనా టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా యాభై నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం.. దాదాపుగా ఒక్కో టెస్టు ఫలితం రావడానికి రెండు రోజుల వరకూ సమయం పడుతోంది. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కిట్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్టులు చేయవచ్చు.

మొత్తంగా ఇరవై వేల టెస్టులు ఈ కిట్ల ద్వారా చేసే అవకాశం ఉంది. ఇంకో వారం రోజుల్లో 10వేల కొవిడ్‌-19 టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు పంపనున్నారు. వైరస్ సామాజిక వ్యాప్తికి దారి తీస్తోందని గుర్తించిన ఏపీ సర్కార్… రాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ మేరకు.. ఈ మెడ్‌టెక్ జోన్ కిట్ల వల్ల… టెస్టుల్లో వేగం పెరుగుతుంది. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో వెంటిలేటర్లను కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దేశంలో.. చాలా పరిమిత సంఖ్యలోనే ఇవి ఉన్నాయి.

కోవిడ్ -19 .. శ్వాస సమస్యను సృష్టిస్తుంది కాబట్టి.. ఎక్కువ మందికి వెంటిలేటర్స్ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకూ… ఏపీలోనే కాదు.. ఇండియాలోనే… వీటి ఉత్పత్తి చాలా పరిమితం. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంది. నెలాఖరు కల్లా మెడ్‌టెక్ జోన్‌లో వెంటిలేటర్స్ కూడా రెడీ అవుతాయి. దీంతో.. ఏపీకి చాలా వరకు వైద్య అవసరాలు తీరుతాయి. దేశానికి కావాల్సిన వైద్య అవసరాలు కూడా.. మెడ్‌టెక్ జోన్ తీర్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close