సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మద్రాస్ హైకోర్టు జడ్జి నోటీసు!

సర్వోన్నత న్యాయస్థానమయిన సుప్రీం కోర్టు ఆదేశాలను దేశంలో అందరూ తూచా తప్పకుండా పాటించాల్సిందే కానీ అది తనకు వర్తించదని మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ఎస్. కర్ణన్ నిశ్చితాభిప్రాయం.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనను కలకత్తా హైకోర్టుకి బదిలీ చేస్తూ ఫిబ్రవరి 12 ఉత్తర్వులు జారీ చేసారు. ఇది మన న్యాయవ్యవస్థలో చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అయితే వివాదాలకు పెట్టింది పేరయిన జస్టిస్ సి.ఎస్. కర్ణన్ తన బదిలీ ఉత్తర్వులను సుమోటుగా స్వీకరించి దానిపై తనే స్టే విదించుకొన్నారు. అంతే కాదు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నోటీసులు కూడా పంపారు. ఈ నెల 29లోగా తన బదిలీకి కారాణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆ నోటీసులో కోరారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక క్రింద కోర్టులో న్యాయమూర్తి నోటీసు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారేమో!

జస్టిస్ సి.ఎస్. కర్ణన్ తీరు చూసి సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను కలకత్తా హైకోర్టుకి బదిలీ చేయడం అయింది కనుక ఆయనకు న్యాయపరమయిన ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని జస్టిస్ జె.ఎస్.ఖేర్, జస్టిస్ఆర్. భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేసింది.

దానిపై జస్టిస్ సి.ఎస్. కర్ణన్ కూడా తనదయిన శైలిలో స్పందించి సుప్రీం కోర్టు మళ్ళీ మరో పెద్ద షాక్ ఇచ్చేరు. దళితుడనయిన తనను విధుల నుండి తప్పించమని ఆదేశించిన సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశిస్తానని హెచ్చరించారు. తనను విధుల నుండి తప్పించినప్పటికీ న్యాయపరంగా తనకు పోలీసులను ఆదేశించే హక్కు కలిగిఉంటానని కనుక ఆ ఇరువురు సుప్రీం న్యాయమూర్తులపై కేసు నమోదు చేయమని సిటీ పోలీస్ కమీషనర్ ని ఆదేశిస్తానని హెచ్చరించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఎంత అత్యున్నత హోదాలో పని చేస్తున్నప్పటికీ దేశంలో దళితులకి వేధింపులు తప్పడం లేదు. ఈ విషయంలో నా ప్రాధమిక హక్కులకు భంగం కలిగినట్లయితే, కుల వివక్షలేని దేశానికి వెళ్లిపోవాలనుకొంటున్నాను,” అని చెప్పారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఈ విధంగా మాట్లాడటం కోర్టు ధిక్కారణ కాదా?” అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు “ఈ విషయాలన్నీ ప్రచురించి కోర్టు ధిక్కారణకు పాల్పడిన మీడియాపై చట్ట పరంగా చర్యలు తీసుకోమని న్యాయస్థానాలను ఆదేశిస్తాను,” అని ఆయన జవాబు చెప్పారు. జస్టిస్ సి.ఎస్. కర్ణన్ సృష్టించిన ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

మ‌రో అవార్డు ఖాయ‌మా కీర్తి.??

https://youtu.be/rjBv3K5FMoU మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ అవార్డుకి కీర్తి అర్హురాలు కూడా. అప్ప‌టి నుంచీ.. ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. అందులో భాగంగా కీర్తి న‌టించిన మ‌రో...

కోలుకుంటున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త‌లు రావ‌డంతో.. యావ‌త్ చిత్ర‌సీమ ఉలిక్కిప‌డింది. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని, క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్ర‌మంగా...

మోహ‌న్‌బాబు ‘స‌న్ ఆఫ్ ఇండియా’

ఫాద‌ర్ ఆఫ్ ది నేష‌న్ అని... మ‌హాత్మాగాంధీని పిలుస్తారు. ఇక నుంచి టాలీవుడ్ మాత్రం `స‌న్ ఆఫ్ ఇండియా` అంటే.. మోహ‌న్ బాబుని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పేరుతో ఇప్పుడు...

వీడు మామూలోడు కాదు..! ఏకంగా లంచం కోటి..!

అవినీతిని అరికట్టేందుకు రూ. 2వేల నోట్లను కేంద్రం నియంత్రించేసింది కానీ.. అదేమీ ఈ తరహా సంపాదనకు అలవాటు పడిన వారికి అడ్డం కాలేదు. రూ. 2వేల నోట్లు కాకపోతే.. రూ. ఐదు వందల...

HOT NEWS

[X] Close
[X] Close