రిపబ్లిక్ టీవీని వెంటాడుతున్న మహా సర్కార్..!

ఆర్నాబ్ గోస్వామికి మహారాష్ట్ర సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో ఆర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆయనకు బెయిల్ కూడా దక్కలేదు. వారం రోజులుగా జైల్లోనే ఉన్నారు. తాజాగా.. రిపబ్లిక్ టీవీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘనశ్యాం సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్పీ స్కాంలో ఆయనను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఓ వైపు ఆర్నాబ్ లేక రిపబ్లిక్ టీవీ సిబ్బంది టెన్షన్ పడుతూంటే.. చానల్ రోజువారీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే సింగ్ ను కూడా అరెస్ట్ చేయడం.. షాక్‌లా తగిలింది.

కొద్ది రోజుల క్రితం.. టీఆర్పీ స్కాంను ముంబై పోలీసులు బయట పెట్టారు. అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత బార్క్ కూడా.. ఈ అక్రమాలను గుర్తించి.. టీఆర్పీ రేటింగ్‌లు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ కేసు కలకలం రేపింది. చివరికి వేరే రాష్ట్రంలో ఫిర్యాదు చేయించి.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే.. మహారాష్ట్ర సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. టీఆర్పీ స్కామ్‌ను తామే దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ టీవీనే పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. డిప్ట్రిబ్యూషన్ హెడ్‌ను అరెస్ట్ చేశారు.

మహారాష్ట్ర సర్కార్‌పై రిపబ్లిక్ టీవీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పై లేనిపోని రచ్చ చేసింది. బాలీవుడ్ ప్రముఖులపై విస్తృతంగా రూమర్స్ ప్రచారం చేసింది. కంగనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇలాంటి సమయంలో శివసేన పత్రిక సామ్నా పలుమార్లు.. ముంబై ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేసింది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు.. పరిణాామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ఆర్నాబ్‌కు.. రిపబ్లిక్ టీవీకి.. ఇతర మీడియా … రాజకీయవర్గాల నుంచి పెద్దగా సపోర్ట్ దక్కడం లేదు. ఒక్క బీజేపీ మాత్రమే సపోర్ట్ చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే కంటెస్టెంట్‌ల టాప్ 3లో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు కూడా బలంగా...

టీఆర్ఎస్‌ను మించి కాంగ్రెస్ మేనిఫెస్టో ..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20వేల లీటర్ల మంచినీరు ఉచితం అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తానేం తక్కువ తినలేదని.. తాము 30వేల లీటర్లు ఇస్తామని హామీ ఇచ్చేసింది. గ్రేటర్ కాంగ్రెస్...

రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సినిమాలేంటి?

చిత్ర‌సీమ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న శుభ ఘ‌డియ ఇది. థియేట‌ర్ల‌కు మోక్షం ఎప్పుడు వ‌స్తుందో, తాళాలు ఎప్పుడు తెరుస్తారో.. అన్న నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ - ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపేసింది. ఇక ఏ...

కేంద్రం “అభయా”నికి జగనన్న ముద్ర..!

ఆటోలకు అభయం యాప్‌ను ఆవిష్కరించే అభయం పథకాన్ని జగన్ కంప్యూటర్‌లో మీట నొక్కి ప్రారంభించారు. తొలి దశలో విశాఖలో కొన్ని ఆటోలకు..ఈ యాప్ అనుసంధాన ఐవోటీలను ఆటోల్లో బిగిస్తున్నారు. అద్భుతమైన పథకమని.. మహిళల...

HOT NEWS

[X] Close
[X] Close