మహారాష్ట్ర అసెంబ్లీలోకి `శని’ !

శని ఆ గడిలో, ఈ గడిలో కాకుండా ఏకంగా చట్టసభలోకే ప్రవేశించబోతున్నాడు. అవును, నిజంగానే ఇది జరగబోతున్నది.
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాలసమావేశాల్లో శనిదేవుని ప్రస్తావన రాబోతున్నది! మరో రెండువారాల్లో (డిసెంబర్ 7) ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో షిర్డీకి చేరువలో ఉన్న శని శింగణాపూర్ లో మహిళల విషయంలో కొనసాగుతున్న ఆచారం, సంప్రదాయాలపై చర్చించాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు ప్రణితి షిండే పట్టుదలగా ఉన్నారు. ఆమె మరెవరోకాదు, మహారాష్ట్ర హోంశాఖ మాజీమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె.

అసెంబ్లీలో చర్చించాల్సినంత తీవ్రమైన సంఘటన శింగణాపూర్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. మూఢనమ్మకాలను వ్యతిరేకించేవారు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, హేతువాదులు….ఇలా చాలామందే శింగణానపూర్ లో జరిగిన సంఘటనలో మహిళా భక్తురాలిని సపోర్ట్ చేస్తుండగా, శింగణాపూర్ మహిళల్లో ఎక్కువమంది సనాతన ఆచారాలనే సమర్థిస్తున్నారు. ఆ సంఘటన వివరాలు ఇవి…

షిర్డీకి చేరువలో ఉండటంతో రోజూ వేలాదిమంది సాయి భక్తులు శని శింగణాపూర్ కు వెళ్ళి శనిదేవునికి పూజాదికాలు నిర్వహిస్తుంటారు. శింగణాపూర్ లో ఒక పద్ధతి ఉంది. పురుషులు నేరుగా నల్లటి శనిదేవుని విగ్రహం ( ఒక ఆకృతిలో కాకుండా, నల్లటి బండ రాయినే శనిగా భావిస్తూ కొలుస్తుంటారు) వద్దకు వెళ్ళి పూజలు, అభిషేకాలు చేసుకోవచ్చు. కానీ అదే మహిళలకు ఆ సాంప్రదాయం లేదు. వారు గర్భగుడికి కొద్ది మీటర్ల దూరంలోనే ఆగిపోయి నమస్కరించుకుని పక్కకు వెళ్ళాల్సిఉంటుంది. అలాంటిది శనివారం (నవంబర్ 28)రోజున ఒక మహిళా భక్తురాలు హఠాత్తుగా బ్యారికేడ్లు దాటేసి, శనిదేవుడ్ని తాకేసి పూజ చేసింది. ఈ సంఘటన అనేకమంది భక్తులను, ఆలయ సిబ్బందిని విస్తుపరిచింది. శనిదేవుడు అపవిత్రమైపోయారని భావించారు. దీంతో మర్నాడు ఆదివారం (నవబంర్ 29) శనిదేవునికి ప్రత్యేక అభిషేకాలతో సంప్రోక్షణ జరిపించారు. ఒక మహిళ శనిదేవుని తాకడం, ఆపైన ఆలయ అర్చకులు సంప్రోక్షణ జరిపించడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. చివరకు అసెంబ్లీలో చర్చించేస్థాయికి ఎదిగింది.

శని శింగణాపూర్ ఓ చిన్న పట్టణం. అక్కడి జనాభా నాలుగువేలు. తమ ఊరికి ఎలాంటి ఈతి బాధలు లేకుండా శనిదేవుడు రక్షిస్తాడని స్థానికులు నమ్ముతుంటారు. శత్రుభయం, చోరభయం తమ ఊరికి తాకవన్నది వారి విశ్వాసం. అందుకే ఊర్లోని ఇళ్లకు దర్వాజాలున్నప్పటికీ, వాటికి తలుపులు ఉండవు. తాళాలు అంతకంటే వేయరు. చివరకు పోలీస్ స్టేషన్ కు కూడ తలుపులు ఉండవు. శనిదేవుని విగ్రహాన్ని దూరం నుంచి మాత్రమే మహిళలు నమస్కరిస్తుండటం ఓ ఆచారంగా ఉంది. అలాంటిది ఒక మహిళ దూకుడుగా లోపలకు వెళ్ళి శని విగ్రహాన్ని తాకి పూజలు చేయడం, ఆ పైన జనంలో కలిసిపోయి అదృశ్యమైపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. శనిదేవునికి అభిషేకంతో సంప్రోక్షం చేయడం సరైన చర్యగా స్థానికులు అంటున్నారు. `ఈ ఊర్లో కొన్ని ఆచారాలున్నాయి. వాటిని పాటించడం మా విధి’ అని చెబుతున్నారు. ఆలయం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షుడు సాయిరాం బంకర్ కూడా ఈ సంఘటన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, తాను పదవి నుంచి తప్పుకుంటానంటున్నారు.

అయితే, మరోపక్క మహిళ చేసిన సాహసానికి పలువర్గాల నుంచి ప్రశంసలొస్తున్నాయి. లింగవివక్షను అంతమొందించే దిశగానే ఈ సంఘటనను చూడాలని కొందరు అభివర్ణిస్తున్నారు. దేశంలో చాలాచోట్ల ఆలయాల్లోకి మహిళకు ప్రవేశం కూడా లేదని, ఇలాంటి వివక్షకు ఫుల్ స్టాప్ పెట్టాలని హేతువాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు ప్రణితి షిండే జోక్యం చేసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటూ రాబోయే శీతాకాలపు సమావేశాల్లో చర్చకు లేవనెత్తుతామంటున్నారు.

మహిళ తాకిందన్న కారణంగా, శనిదేవునికి సంప్రోక్షణ చేయడం మహిళాలోకాన్ని కించపరచడమే అవుతుందన్న వాదన బలపడుతోంది. మరి చివరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి అర్థవంతమైన చర్చ జరుగుతుందో చూడాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close