మహా “మహా” ట్విస్ట్ ..! శివసేన బకరా..!

అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లయింది మహారాష్ట్రాలో శివసేన పరిస్థితి. మీరే సీఎం రేపే ప్రమాణస్వీకారం.. కొత్త బట్టలు కుట్టించుకోమని.. ఉద్దవ్ ధాకరేకు .. నమ్మకంగా చెప్పిన శరద్ పవార్.. తెల్లవారేసరికి..బీజేపీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశారు. శనివారం శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి.. గవర్నర్ వద్దకు వెళ్లి .. ప్రభుత్వ ఏర్పాటు కోసం… పత్రాలు సమర్పించబోతున్నారని చెప్పుకున్నారు. కానీ వారికి ఆ అవకాశం రాకుండానే… శనివారం తెల్లవారగానే.. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో.. ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా.. శరద్ పవార్ మేనల్లుడు.. అజిత్ పవార్ ప్రమాణం చేసేశారు. ఇది.. రియల్ న్యూసా.. ఫేక్ న్యూసా.. అని.. అందరూ తమను తాము గిల్లుకుని చూసేసరికి.. అంతా నిజమేనని తేలిపోయింది.

అలా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం వార్త బయటకు రాగానే.. ఇలా.. ప్రధానమంత్రి మోడీ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా… ఫడ్నవీస్‌కు.. శుభాకాంక్షలు చెబుతూ.. ట్వీట్లు చేశారు. దీంతో.. బీజేపీ గేమ్ ప్లాన్… పై రాజకీయవర్గాలకు ఓ క్లారిటీ వచ్చినట్లయింది. అధికారమే పరమావధిగా.. తాము సిద్ధాంతాలకు సమాధి కట్టడానికి రెడీ అని.. శివసేన… బీజేపీకి నిరూపించడానికి సిద్ధమయింది. కానీ అందులో తాము సిద్ధహస్తులమని.. తమను ఎవరూ బీట్ చేయలేరని.. శివసేనకు బీజేపీ … తెలిసొచ్చేలా చేసింది. బీజేపీ – శివసేన కూటమిగా పోటీ చేసినా… తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి కావాల్సిందేనని పట్టుబట్టి.. ఎన్సీపీ-కాంగ్రెస్ పై నమ్మకంతో.. బీజేపీకి గుడ్ బై చెప్పిన శివసేన ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి అయింది.

మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రెండు రోజుల నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల కిందట.. శరద్ పవార్ ప్రధానితో భేటీ అయి.. డీల్ సెట్ చేసుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కనీయలేదు. ప్రధానితో రాజకీయాలు మాట్లాడలేదని.. చెబుతూ.. శివసేనతో.. శుక్రవారం.. డీల్ సెట్ చేసుకున్నారు. ఉద్దవ్ ధాకరేకు సీఎం పోస్ట్ ఆఫర్ ఇచ్చారు శరద్ పవార్. కానీ.. అదంతా.. గేమ్ ప్లానే. శనివారం ఉదయం.. ఫడ్నవీస్‌తో ప్రమాణస్వీకారానికి.. రాజ్‌భవన్ శుక్రవారమే ఏర్పాట్లు చేసింది. ఇది … ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా, శరద్ పవార్, అజిత్ పవార్, గవర్నర్ కోషియారీలకు మాత్రమే తెలుసు. చివరికి.. ఏం జరిగిందో తెలుసుకునేసరికి.. శివసేన.. నడిరోడ్డుపై ఒంటరిగా నిలిచిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

HOT NEWS

[X] Close
[X] Close