మహర్షి..సవివరంగా…సుదీర్ఘంగా…

తెలుగు360 రేటింగ్‌ 2.75/5

సినిమా వేరు. నవల వేరు. నవల సవివరంగా వుంటుంది. సినిమా లాజిక్ కు కాస్త దూరంగా వున్నా, వినోదానికి దగ్గరగా వుంటుంది. వుండాలి కూడా. ఫ్యామిలీ ఫ్యామిలీలు సినిమాకు తరలి వెళ్లాలి అంటే అక్కడ బలమైన రీజన్ వుండాలి. బాహుబలిలా ఫాంటసీ కావాలి. ఎఫ్ 2 మాదిరగా ఎంటర్ టైన్ మెంట్ అయినా వుండాలి. శ్రీమంతుడు మాదిరిగా బలమైన సింగిల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న అంతకన్నా బలమైన కథ అయి వుండాలి.

అలా కాకుండా హీరో అమలాపురం నుంచి అమెరికా వెళ్లాడు అంటే ఇక్కడ బస్ స్టాండ్ లోకి వచ్చి, సోడా తాగి, బస్ ఎక్కి, పల్లీలు కొనుక్కున్న దగ్గర నుంచి ఎయిర్ పోర్టులో బోర్డింగ్ పాస్ తీసుకుని, అమెరికాలో టాక్సీ బుక్ చేసుకునే వరకు చూపించాల్సిన పనిలేదు. జర్నీ ఆఫ్ ఏ రిషి అని క్యాప్షన్ పెట్టినంత మాత్రాన, అలాగే తీసాం, అలాగే తీయాలి అని అంటే అది సమర్థన మాత్రమే అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి. ఈ సినిమా కోసం మంచి దర్శకుడు అని ప్రూవ్ చేసుకున్న వంశీ పైడిపల్లి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేసారు అనగానే ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి అంచనాలు పెరిగిపోయాయి. తీరా చేసి సినిమాకు వెళ్తే, శ్రీమంతుడు సినిమాకు త్రీ ఇడియట్స్ సినిమాను ముడిపెట్టినట్లు, శ్రీమంతుడు సినిమాకు ఎక్సెటెండెడ్ వెర్షన్ తీసినట్లు అనిపించడం అన్నది ఒక సమస్య. పోనీ అదేమంత పెద్ద సమస్య కాదు, పాత పాయింట్ కు కొత్త హంగులు అద్దారు అని సరిపెట్టుకుందామంటే, శ్రీమంతుడులో వున్న స్ట్రయిట్ నెరేషన్ ఇక్కడ కనిపించదు. చాలా డిటైల్డ్ గా చెక్కుకుంటూ వెళ్లారు. అమెరికా నుంచి ఇండియా వెళ్లాలి అని హీరో అనుకోగానే, టక్కున వెళ్లిపోవచ్చు. మన జనాలేమీ లాజిక్ మిస్ అని అనరు. బోర్డు మీటింగ్, బోర్డు మెంబర్ల గగ్గోలు, ఆ తదనంతర సన్నివేశాలు అక్కరలేదు. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో ఏరి పక్కన పెట్టాలంటే మరి కొన్ని వున్నాయి. ఇవి ఎత్తిచూపడంలో విషయం మరేం కాదు, ఈ సబ్జెక్ట్ కు అంత సేపు ప్రేక్షకుడిని కూర్చో పెట్టాల్సిన అవసరం కాదు.

ఆర్ నారాయణమూర్తి అన్నదాత సుఖీభవ అంటూ రైతుల సమస్య మీద సినిమా తీస్తే ఎవ్వరూ చూడకపోవచ్చు. కానీ అదే పాయింట్ ను మహేష్ బాబు చెబితే, గ్లామర్ అద్దకంతో అందంగా కనిపిస్తుంది. కానీ కేవలం ఆ పాయింట్ మీదనే ఫోకస్ చేస్తే సమస్య గా మారుతుంది.

ఖైదీ నెంబర్ 150లో మూడు వంతులు ఎంటర్ టైన్ మెంట్, హీరో ఎలివేషన్ వుంటూ, చివర్లో రైతుల సమస్య ఎమోషనల్ గా ఎలివేట్ అవుతుంది. శ్రీమంతుడు సినిమాలో హీరో డౌన్ టు ఎర్త్ నేచుర్ చుట్టూ కథ అల్లుకుంటూ, పల్లెటూరికి షిప్ట్ చేసినా, ఎంటర్ టైన్ మెంట్, గ్లామర్ మాత్రం మిస్ కాదు. ఇలా వినోదాన్ని, విషయాన్ని సమపాళ్లలో రంగరించితే తప్ప పెద్ద సినిమాలు శహభాష్ అనిపించుకోవు.

మహర్షి సినిమాలో అసలు కథ అంతా ద్వితీయార్థంలోనే వుంటుంది. ఓ మల్టీ బిలియనీర్ ఇండియా తన మిత్రుడి కోసం వచ్చి అతని సమస్యను తన సమస్యగా చేసుకుని, కార్పొరేట్ స్వామ్యం మీద పోరాడి గెలవడం అన్నది పాయింట్. అయితే ఒక సామాన్యుడు పంతంతో మల్టీ మిలియనీర్ గా ఎలా ఎదిగాడు అన్నది తొలిసగంలో వుంటుంది. అంటే ఇవి రెండు కథలు అన్నమాట. అయితే ఈ రెండు కథలకు ముడిపెట్టడానికి స్నేహం, ద్రోహం లాంటి పాయింట్లు వాడుకున్నారు.

పోనీ ఇలా రెండు కథలు, వాటికి ఓ అతుకుతో సరిపెట్టుకున్నారా? అంటే అదీ కాదు, ద్వితీయార్థంలో కథ అనేక పాయింట్ల చుట్టూ తిరుగుతుంది. అసలు సమస్య ఏమిటి? పంట రుణాలు ఇవ్వకుండా, పండించినా కొనకుండా, భూముల బీడు పట్టేలా చేస్తున్నారు అన్నదే కదా? శ్రీమంతుడులో మాదిరిగా తన డబ్బుతో రుణాలు ఇచ్చి, తనే కొని, అమ్మడం లాంటి మ్యాజిక్ లు చేసి వుంటే వేరుగా వుండేది. సమస్య కోసం ముందు ప్రభుత్వం, కార్పొరేట్ ల చుట్టూ తిరగడం, ఆఫై ప్రఫంచం దృష్టి ఆ ఊరి మీద పడేలా చేయడం, అదీ కుదరక తానే నిరసనకు కూర్చోవడం, ఆపై తాను వ్యవసాయంలో దిగడం, జనాలను మోటివేట్ చేయడం ఇలా రకరకాల ట్రయిల్ అండ్ ఎర్రర్ టైపు వ్యవహారాల చుట్టూ తిరుగుతుంది సినిమా.

మహర్షి సినిమాలో కీలకమైన సమస్య లెంగ్త్ మాత్రమే కాదు. కథ, కథనం కూడా. కథలో కొత్త పాయింట్ కనిపించదు. స్నేహితుడు త్యాగం చేయడానికి అల్లుకున్న ప్లాట్ కూడా లాజిక్ కు దూరంగా వుంటుంది. అదే కాలేజీలో వుంటూ, అదే రూమ్ ల వుంటూ, స్నేహితుడికి ఇలా జరిగింది అన్నది కూడా తెలియదనడం, కేవలం తాళం పట్టుకుని, పోలీసులు నేరస్థుడు అని ఫిక్స్ అయిపోవడం సిల్లీగా వుంది. పాత కాలం సినిమాలను గుర్తుకు తెచ్చింది. సినిమాలో ప్రతి సన్నివేశం ముందే ఊహించేదిగా, ప్రతి సీన్ ఏదో సినిమాలో చూసేసినదిగా అనిపించడం వల్ల భారీ నిర్మాణ విలువలు వున్నా, అలరించకుండా వుంటాయి. హీరో పెళ్లి చూపుల సీన్ చూస్తే తమిళం సినిమాలు గుర్తుకు వస్తాయి. హీరో ఎలివేషన్ పాట అంటే కారు దిగడం, ఛాపర్ ఎక్కడం, ఛాఫర్ దిగడం, కారు ఎక్కడం, కోట్లు మార్చడం ఇదేనా? హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఈ మాదిరిగా గతంలో ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఇలా ప్రతి సీన్ కు ఏదో ఒక సినిమా అన్నా గుర్తు వస్తుంటుంది. ఆఖరికి పల్లెటూరిలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి, హీరో పటాటోపం చూస్తే, అత్తారింటికి దారేది కూడా గుర్తుకువస్తుంది.

స్ట్రయిట్ టు ది పాయింట్ అనే కీలకమైన విషయాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. తన దైన స్టయిల్ టేకింగ్ అని చెప్పుకోవడానికి ఆయన తీసినట్లుంది. కానీ ప్రేక్షకులకు లెంగ్తీ అయింది. పైగా ఒక్క కాలేజీ ఎపిసోడ్ మినహాయిస్తే వినోదం అన్నది దాదాపు పూర్తిగా మిస్ అయింది. ఎప్పుడు అయితే వినోదం అన్నది మిస్ అయిందో, సెంటిమెంట్, ప్రబోధాలు ఎక్కువయ్యాయో, కచ్చితంగా లెంగ్త్ మీద దృష్టి పడుతుంది. దాంతో పే..ద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

అసలు సినిమా చూసిన తరువాత వచ్చే ఫస్ట్ సందేహం ఒక్కటే, శ్రీమంతుడు కథకే మరి కాస్త అతుకుల వేసి స్క్రిప్ట్ చెబితే మహేష్ ఓకె అన్నారా? లేక కేవలం రిషి అనే వ్యక్తి బాల్యం, యవ్వనం, విజయం, పయనం అంటూ చెబితే అద్భుతం అనుకుని ఓకె చేసారా? కానీ మళ్లీ అక్కడే ఇంకో సమస్య. హీరో క్యారెక్టర్ మీద మమకారం పెంచుకుని, దృష్టి పెట్టి, బలమైన విలనిజం లేకుండా, కమెడియన్ ట్రాక్ పట్టుకోకుండా, హీరోయిన్ ట్రాక్ ను మిస్ చేసుకుని సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం చేసుకున్నారని అనిపిస్తుంది.

సినిమాటోగ్రఫీ అధ్భుతంగా వుంది. తెరమీద భారీ ఖర్చు కనిపిస్తోంది. నేఫథ్య సంగీతం ఓకె. పాటలు కేవలం సిట్యువేషన్ల కోసం రాసుకోవడంతో దేవీశ్రీప్రసాద్ కూడా పెద్దగా ఏమీ చేయలేకపోయారు. సంభాషణలు అక్కడక్కడ మెరుపులు మెరిసాయి కానీ, ఇంకా మంచి మాటలు వినిపించే అవకాశం మిస్ చేసుకున్నారేమో అనిపిస్తుంది.

మహష్ అందానికి, నటనకు వంక పెట్టడానికి ఎక్కడా చాన్స్ లేదు. మూడు షేడ్స్ లో ఒదిగిపోయాడు. ముఖ్యంగా స్టూడెంట్ గా ఓ మాంచి సినిమా చేస్తే బాగుండును అనిపించేలా వున్నాడు. పూజ హెగ్డేకు అంత అవకాశం లేదు. వెన్నెల కిషోర్ ను వృధా చేసుకున్నారు.

మొత్తం మీద చూసుకుంటే మూడేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసిన వాళ్లు, మరో మూడు నెలలయినా కాస్త జాగ్రత్తపడి వుంటే, ఇన్ని కోట్లు ఖర్చు చేసినందుకు మహేష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ వచ్చి వుండేది. ఇప్పుడు ఓకె సినిమా అనే రేంజ్ దగ్గర ఆగిపోయేలా చేసుకున్నారు. దీనికి అందరూ దర్శకుడు వంశీ పైడిపల్లిని తప్ప మరొకరిని తప్పుపట్టే పరిస్థితి లేదు.

ఫినిషింగ్ టచ్–హర్షించేంత కాదు..

తెలుగు360 రేటింగ్‌ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close