గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కరువుబారిన పడిన ప్రాంతాల్లో వ్యవసాయకూలీలకు అత్యంత ఉపయోగకరంగా ఉండే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో సహా రూపు రేఖల్ని కేంద్రం మార్చేస్తోంది. ఇందు కోసం కొత్త చట్టం తీసుకు వచ్చింది. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఈ పథకాన్ని పేరుతో సహా తీసేసి కొత్త పేరు పెట్టారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ అని పేరు పెట్టారు.
మొత్తంగా చూస్తే పథకాన్ని తీసేసి కొత్త పథకాన్ని తెచ్చారని అనుకోవాలి. ఎదుకంటే పథకంలో మహాత్మాగాంధీ పేరు మాత్రమే కాదు.. మొత్తం పథకం మౌలిక స్వరూపరమే మారిపోయింది. ఎక్కువ రోజులు పని కల్పిస్తామని చెబుతున్నారు కానీ అత్యధికంగా భారం రాష్ట్రాలపై పడేలా చేస్తున్నారు. రాష్ట్రాలు ఇంత భారాన్ని మోయడం ఎందుకని పథకాన్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉంది.
ఈ మార్పులకు కేంద్రం విచిత్రమైన కారణాలు చెబుతోంది. దేశంలో పేదరికం తగ్గిపోయిందని అందుకే మార్పులు తెస్తున్నామని చెబుతోంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ గ్రామీణ జీవనోపాధి భద్రతపై దృష్టి సారించింది. కొత్త చట్టం సాధికారత, వృద్ధి లక్ష్యంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. , నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పనులు ప్రాధాన్యతగా ఉంటాయి. మొత్తంగా ఈ పథకం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్‌గా మార్పు చేశారు. వ్యవసాయ సీజన్లో 60 రోజులు ఉపాధి హామీ పనులు ఉండవు.
ఒకప్పుడు ఈ పథకం గ్రామీణ పేదలకు ఓ నరకం. తర్వాత రాను రాను అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. అత్యధిక నిధులు పనులు చేయకుండానే ఖర్చు చేస్తున్నారన్న నివేదికలు ఉన్నాయి. కరెక్ట్ చేయడానికి ప్రయత్నించడం కన్నా.. మొత్తంగా మార్చేసి మెల్లగా నిర్వీర్యం చేయడం మంచిదని కేంద్రం అనుకుంది.
