విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌కు అండ‌గా మ‌హేష్

గాసిప్ వెబ్ సైట్ పై విజయ్ దేవ‌ర‌కొండ యుద్ధం ప్ర‌క‌టించాడు. తాను స్థాపించిన‌ `మిడిల్ క్లాస్ ఫండ్‌` కార్య‌క‌లాపాల్ని ఎద్దేవా చేస్తూ – సామాజిక సృహ లేకుండా ప్ర‌వ‌ర్తించిన ఓ వెబ్ సైట్‌పై – విరుచుకుప‌డుతూ ఓ వీడియో రూపొందించాడు విజ‌య్‌. కిల్ ద ఫేక్ న్యూస్ అంటూ ఓ నినాదంతో – ముందుకొచ్చాడు. దీనిపై విజ‌య్‌కి అంద‌రి నుంచీ అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. విజ‌య్‌తో పాటుగా మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు గొంతు క‌లుపుతున్నారు. `నీ వెంట మేమున్నాం` అంటూ భ‌రోసా ఇస్తున్నారు.

ఈరోజు `కిల్ ద ఫేక్ న్యూస్‌` పేరిట విజ‌య్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది బాగా వైర‌ల్ అవుతోంది. బ్లాక్ మెయిల్ చేస్తూ ప‌బ్బం గ‌డుపుతున్న స‌ద‌రు వెబ్ సైట్ కి వ్య‌తిరేకంగా, విజ‌య్‌కి అనుకూలంగా గొంతులు లేస్తున్నాయి. `ఐ స్టాండ్ బై యూ బ్ర‌ద‌ర్‌` అంటూ తొలి మ‌ద్ద‌తు మ‌హేష్ బాబు నుంచి వ‌చ్చింది. కొర‌టాల శివ‌, అనిల్ రావిపూడి, హ‌రీష్ శంక‌ర్‌, అనిల్ సుంక‌ర‌, బీవీఎస్ ర‌వి… ఇలా వీళ్లంతా త‌మ ట్వీట్ల ద్వారా విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇది క‌చ్చితంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాపు నేస్తం పథకం దుర్వినియోగం

కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును...

22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది....

సచివాలయం కూల్చివేత – ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ !

పాలకుల ప్రాధాన్యతలు, పాలితుల దైనందిక సమస్యలు, వారి కనీస అవసరాలు తీర్చే దిశగా, పరిష్కారారాలు వెతికే మార్గం మీద ఉండాలి. అప్పుడే అది జనరంజకమైన పాలన అనిపించుకుంటుంది. శతాబ్దానికి ఒక్కసారి వచ్చే విపత్తు...

HOT NEWS

[X] Close
[X] Close