ఈ లీకులేంటి… మ‌హేష్ ఫైర్‌!

సినిమాకి సంబంధించిన ఏ విష‌య‌మైనా స‌ర్‌ప్రైజ్‌గా ఉంచాల‌నుకుంటుంది చిత్ర‌బృందం. పాటో, ఫ‌స్ట్ లుక్కో, టీజ‌రో.. ఇవ‌న్నీ అఫీష‌య‌ల్‌గా వ‌చ్చేంత వ‌ర‌కూ… దాచి ఉంచాల్సిన బాధ్య‌త చిత్ర‌బృందానిదే. బ‌డా స్టార్ల సినిమాల విష‌యంలో అయితే ఈ విష‌యంలో మ‌రింత గోప్య‌త అవ‌స‌రం. కానీ… `స‌ర్కారు వారి పాట‌` విష‌యంలో ఇదంతా రివ‌ర్స్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌తీ అప్ డేటూ… చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌క ముందే వ‌చ్చేస్తోంది. క‌ళావ‌తీ పాటైతే, ముందే లీక‌యిపోయింది. సెకండ్ సింగిల్ లో సితార క‌నిపిస్తుంద‌న్న హింటు మీడియాకి ముందే వ‌చ్చేసింది. ఇవ‌న్నీ చిత్ర‌బృందాన్ని కంగారు పెట్టే అంశాలే. ఏదైతే స‌ర్‌ప్రైజ్‌గా ఉంటుంద‌నుకుంటున్నారో, అది ముందే లీక‌యిపోవ‌డం వ‌ల్ల ఆ థ్రిల్ మిస్స‌వుతోంది.

దీనిపై మ‌హేష్ బాబు కూడా గుర్రుగానే ఉన్నాడ‌ని టాక్‌. క‌ళావ‌తీ పాట ముందే లీక‌యిన‌ప్పుడు మ‌హేష్ ఫైర్ అయిపోయాడ‌ని దానికి నిర్మాత‌లు సైతం స‌మాధానం చెప్ప‌లేక‌పోయార‌ని టాక్‌. పాట లీక‌వ్వ‌డం ఒక్క‌టే కాదు. అస‌లు సినిమాకి సంబంధించిన అన్ని విష‌యాలూ ముందే బ‌య‌ట‌కు ఎలా వెళ్తున్నాయ‌ని.. మ‌హేష్ కొంచెం గ‌ట్టిగానే అడిగాడ‌ట‌. ఇక నుంచి…అప్ డేట్లు ఇచ్చే విషయంలో జాగ్ర‌త్త‌గా ఉంటామ‌ని నిర్మాత‌లు స‌ర్ది చెప్పార‌ని తెలుస్తోంది. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మ‌హేష్ చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. త‌న‌కంటూ ఓ స్ట్రాట‌జీ ఉంటుంది. స‌ర్కారు వారి పాట విష‌యంలో అది మిస్ అవుతోంది. అందుకే మ‌హేష్ ఇంత హైరానా ప‌డుతున్నాడు. ఈ విష‌యంలో మైత్రీ… ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close