సుద‌ర్శ‌న్ థియేట‌ర్లో మ‌ళ్లీ కాల‌ర్ ఎగ‌రేసిన మ‌హేష్‌

‘మ‌హ‌ర్షి’ సినిమా చూశాక అభిమానులంతా కాల‌ర్లు ఎగ‌రేస్తార‌ని… ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మ‌హేష్ జోస్యం చెప్పాడు. మ‌హ‌ర్షి విజ‌యంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. ప్ర‌స్తుతం బాక్సాఫీసు రికార్డుల్ని చూసి మ‌హేష్ ఫ్యాన్స్ కాల‌ర్లు ఎగ‌రేస్తున్నారు. మ‌హేష్ కూడా మొన్న‌టి స‌క్సెస్ మీట్లో కాల‌ర్ ఎగ‌రేశాడు. ఇప్పుడు మ‌రోసారి అభిమానుల ముందు కాల‌ర్ ఎగ‌రేసి – హంగామా చేశాడు.

మ‌హ‌ర్షి విజ‌యోత్స‌వంతో భాగంగా ఈ రోజు మ‌హేష్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కి త‌న టీమ్ తో స‌హా వెళ్లాడు. అక్క‌డున్న అభిమానుల్ని ఉత్సాహ‌ప‌ర‌చ‌డానికి మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేశాడు. ఇదే థియేట‌ర్లో త‌ను మురారి సినిమా చూశాన‌ని గుర్తు చేసుకున్నాడు. “మురారి ఇదే థియేట‌ర్లో చూశా. ఆ రోజు సినిమా చూశాక నాన్న‌గారు నా భుజం మీద సంతోషంగా చేయి వేశారు. అప్ప‌టి నుంచీ ఈ థియేట‌ర్ నాకెంతో ప్ర‌త్యేకంగా మారింది. ఈమ‌ధ్య నేను ఎంబీ అనే మ‌ల్టీప్లెక్స్‌లో భాగం పొందాను. అయిన‌ప్ప‌టికీ సుద‌ర్శ‌న్ నా సొంత థియేట‌ర్‌లా భావిస్తాను” అని చెప్పుకొచ్చాడు మ‌హేష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిమ్మగడ్డను కలిసిన సీఎస్..! రివర్స్ వాదన..?

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ... అధికారికంగా మాత్రం సీఎస్...

రాజధాని రైతులకు బేడీలు వేసిన పోలీసులపై వేటు..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతికి భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా బేడీలు వేసి.. జైలుకు తరలించిన ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లను గుంటూరు ఎస్పీ విశాల్...

వైసీపీ వైపు సీపీఎం.. ఎన్నికల వైపు మిగతా పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల అభిప్రాయాలు సేకరించారు. అధికార పార్టీ వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన పార్టీల్లో ఒక్క...

రూ.2 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్‌

క‌రోనా చిత్ర‌సీమ‌ని పూర్తిగా సంక్షోభంలో నెట్టేసింది. సినిమా రంగం కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. నిర్మాత‌ల‌కు కాస్త ఉత్సాహాన్ని, ఊపిరిని ఇవ్వాలంటే తార‌లు పారితోషికం త‌గ్గించుకోవాల్సిందే అంటూ స‌ల‌హా...

HOT NEWS

[X] Close
[X] Close