మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్… శ్రీమంతుడు. దాదాపుగా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా ఇది. తెలుగు ఇండ్రస్ట్రీ రికార్డుల పరంగా నెం.2 సినిమా. ఈ సినిమాతోనే దర్శకుడిగా కొరటాల శివ రేంజు కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది. కొరటాల మహేష్ కోసం ఓ కథ రాసుకొన్నాడు. మహేష్ కూడా ఓకే అనేశాడు. డిసెంబరు నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతుంది. డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. అయితే ఇది శ్రీమంతుడు కాంబినేషనే అయినా.. ఆ కథకీ ఈ కథకూ పొంతన ఉండదట. వేరే డిఫరెంట్ ఐడియాలజీ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లతో సాగే సినిమా అట.
ఈ సినిమాపై కొరటాల శివ మాట్లాడుతూ ”శ్రీమంతుడు సినిమాకీ, దీనికీ ఎలాంటి పోలిక ఉండదు. నాకు సీక్వెల్స్ అన్నా, రీమేకులన్నా ఇష్టం ఉండదు. పూర్తిగా ఇది కొత్త కథ” అన్నారు. దీంతో మురుగదాస్ సినిమా తరవాత మహేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసినట్టైంది. మహేష్ కథని పూర్తి స్థాయిలో సిద్దం చేయడానికి కొరటాలకు తగిన సమయమే దొరికింది. మధ్యలో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నా.. కొరటాల మాత్రం మహేష్ సినిమా కోసం నాలుగు నెలలు ఆగడానికి రెడీ అయిపోయాడని తెలుస్తోంది. సో.. శ్రీమంతుడు కాంబినేషన్ని 2017లో చూసేయొచ్చన్నమాట.