‘ఏకే’లో మ‌హేష్ మ‌రో సినిమా

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ నిర్మిస్తున్న సంస్థ‌ల్లో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఒక‌టి. ఇప్పుడు మ‌హేష్ బాబుతో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యింది. ‘కేజీఎఫ్‌’ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో మ‌హేష్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే లైన్ చెప్పిన ప్ర‌శాంత్ నీల్ – త్వ‌ర‌లోనే మ‌రోసారి నేరేష‌న్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యాడు. అది కూడా ఓకే అయిపోతే – ఈ సినిమా ప‌ట్టాలెక్కేస్తుంది. ‘కేజీఎఫ్ 2’ ముగిసిన వెంట‌నే మ‌హేష్‌తో జ‌ట్టు క‌డ‌తాడు నీల్‌.

‘స‌రిలేరు…’ త‌ర‌వాత మ‌హేష్ – వంశీ పైప‌డిల్లి కాంబో ఒక‌టి సెట్స్‌పైకి వెళ్లాల్సింది. అయితే… అది కాస్త వెన‌క్కి వెళ్లే అవ‌కాశం ఉంది. ప్ర‌శాంత్ నీల్ తో సినిమాకి అనిల్ సుంక‌ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలోనూ మ‌హేష్ నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటాడ‌ట‌. మ‌రోవైపు వంశీ పైడిప‌ల్లి మాత్రం మ‌హేష్ కోసం క‌థ‌ని త‌యారు చేయ‌డంలో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. సినిమా ప‌ట్టాలెక్క‌డానికి టైమ్ ఉంది కాబట్టి, వంశీ కాస్త రిలాక్స్ అవ్వొచ్చిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

తప్పు యాజమన్యాలది .. పరిహారం మాత్రం ప్రజల సొమ్మా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా... భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్...

2018-19 పంచాయతీ అవార్డుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన సంస్కరణలను మెచ్చి కేంద్ర ప్రభుత్వం 15 అవార్డులు ఇచ్చింది. " ఈ - పంచాయతీ పురస్కార్‌" కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. సాధారణ కేటగిరిలో ప.గో...

HOT NEWS

[X] Close
[X] Close