2020లో మ‌హేష్ నుంచి.. రెండు!!

యేడాదికో సినిమా.. మ‌హేష్ స్ట్రాట‌జీ ముందు నుంచీ ఇదే. క‌థ‌ల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండడంతో సినిమా సినిమాకి మ‌ధ్య గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంది. అయితే 2020లో మ‌హేష్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి సినిమాని 2020 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్. 2020 మార్చి నుంచి ప‌ర‌శురామ్ సినిమా మొద‌లైపోతుంది. ప‌ర‌శురామ్ సినిమాని ఆరు నెల‌ల్లో పూర్తి చేయాల‌న్న‌ది టార్గెట్‌. ప‌ర‌శురామ్ కూడా స్పీడుగా సినిమా తీయ‌డంలో స‌మ‌ర్థుడే. ప‌ర‌శురామ్ సినిమాని 2020 చివ‌ర్లో విడుద‌ల చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అంటే 2020లో మ‌హేష్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయ‌న్న‌మాట‌. జూన్‌లో అనిల్ రావిపూడి సినిమాని ప‌ట్టాలెక్కిస్తారు. డిసెంబ‌రు నాటికి సినిమా పూర్త‌యిపోతుంది. 2020 సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా ఉండే అవ‌కాశాలున్నాయి. ప‌ర‌శురామ్ సినిమా పూర్త‌యిన త‌ర‌వాత రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో మ‌హేష్ సినిమా మొద‌ల‌వ్వ‌బోతోంది. త్రివిక్ర‌మ్ కూడా మ‌హేష్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నాడు. మ‌రోవైపు సుకుమార్ సినిమా ఒక‌టి పెండింగ్‌లో ఉంది. సో… రాబోయే రెండు మూడేళ్ల‌లో మ‌హేష్ కాల్షీట్లు అస్స‌లు ఖాళీ లేవ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం ఏపీ ఉద్యోగులు..! పండగకు డీఏల్లేవ్.. జీతం బకాయిల్లేవ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత...

రివ్యూ: క‌ల‌ర్ ఫొటో

తెలుగు360 రేటింగ్ : 2.75/5 సినిమా ప్రేమ‌ల‌కు ఎన్ని అవ‌రోధాలో. కులం, డ‌బ్బు, మ‌తం, ప్రాంతం, దేశం - అన్నీ అడ్డుప‌డుతుంటాయి. వాట‌ని దాటుకుని ప్రేమికులు ఎలా క‌లిశార‌న్న‌దే క‌థ‌లవుతుంటాయి. ఇప్పుడు ఈ...

రైతు ఉద్యమానికి తలొగ్గిన కేసీఆర్..!

సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో తొలి సారి వెనక్కి తగ్గారు. తెలంగాణలో రైతులు పండిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. నిన్నటి వరకూ కేసీఆర్... మక్కలకు...

ఇక పోలవరానికి పైసా కూడా ఇవ్వరా..!?

పోలవరం విషయంలో కేంద్రం నిధులకు పూర్తి స్థాయిలో కొర్రీలు పెడుతూండటంతో ఏపీ సర్కార్ చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఇక తప్పదన్నట్లుగా గత ప్రభుత్వంపై నెట్టేస్తే సరిపోతుదన్న వ్యూహానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక...

HOT NEWS

[X] Close
[X] Close