మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రారంభం

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 16 నుండి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మొదలయింది. ఈ సినిమాని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు అందాల భామలు సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రావు రమేష్, నరేష్, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, జయసుధ, రేవతి,తులసి, ఈశ్వరీ రావు, రజిత, కాదంబరి కిరణ్, చాందినీ చౌదరి తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు శ్రీకాంత్ అడ్డాలతో చేస్తున్నాను. శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్ నాకు చాలా నచ్చింది. ఇది కూడా ఆ సినిమాలాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టెయినర్ అవుతుందని నమ్ముతున్నాను. శ్రీమంతుడు వంటి మంచి సందేశాత్మకమయిన సినిమా తరువాత ఇటువంటి మంచి సినిమా చేస్తుండటం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది,” అని అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్: “మా బ్రహ్మోత్సవాన్ని సరిగ్గా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు మొదలయిన రోజే మొదలుపెట్టాము. మొదటిరోజు షూటింగ్ లో హీరో మహేష్ బాబుతో సహా మొత్తం 21మంది ప్రధాన నటీనటులతో ఒక సెలబ్రేషన్ సాంగ్ ను చిత్రీకరించాము. ఇకపై ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి,’ అని అన్నారు.

నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి: “ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిగారి నేతృత్వంలో మొత్తం 513మంది నిపుణులు, వర్కర్లు కలిసి పనిచేసి ఒక అత్యద్భుతమయిన సెట్ తయారు చేసారు. అందులోనే ఇవ్వాళ్ళ షూటింగ్ చేసాము. వచ్చే వేసవికి మా బ్రహ్మోత్సవం విడుదల చేయాలని అనుకొంటున్నాము.”

కధ, దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ అడ్డాల సంగీతం: మిక్కీ జె మేయర్, కెమేరా: ఆర్. రత్నవేలు, డాన్స్: రాజు సుందరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close