వంశీని పొగిడానంతే.. సుకుమార్‌ని ఏమీ అన‌లేదు: మ‌హేష్ క్లారిటీ

‘మ‌హ‌ర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో మ‌హేష్ బాబు సుకుమార్ కి ఇచ్చిన కౌంట‌ర్ గుర్తింది క‌దా? ‘వంశీ నా గురించి రెండేళ్లు ఆగాడు. ఈరోజుల్లో అలా ఆగ‌డం చాలా క‌ష్టం. రెండు నెల‌లు ఆల‌స్య‌మైనా ఆ క‌థ‌ని మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు ప‌ట్టుకెళ్లిపోతున్నారు’ అంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా సుకుమార్‌పై కౌంట‌ర్ వేశాడు. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్‌పై వివ‌ర‌ణ ఇచ్చాడు మ‌హేష్. `మ‌హ‌ర్షి` ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మ‌హేష్ బాబు మీడియా ముందుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా సుకుమార్ కి ఇచ్చిన కౌంట‌ర్ ప్ర‌శ్న‌గా ఎదురైంది. దానిపై మ‌హేష్ స్పందించాడు.

వంశీని తాను పొగిడాన‌ని, సుకుమార్ ని ఏమీ అన‌లేద‌ని, మీడియా ఆ స్టేట్‌మెంట్‌లో అర్థాలు వెతకద్దని అంటున్నాడు మ‌హేష్. సుకుమార్ త‌న‌కు `నేనొక్క‌డినే` అనే మంచి సినిమా ఇచ్చాడ‌ని, త‌న‌నెప్పుడూ గుర్తు పెట్టుకుంటాన‌ని, తామిద్ద‌రం ఓ సినిమా చేద్దామ‌నుకున్నామ‌ని, అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సేఫ్ జోన్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయాల‌న్న ఉద్దేశంతోనే అనిల్ రావిపూడి క‌థ‌కు ఓకే చెప్పాన‌ని, ఈలోగా సుకుమార్ మ‌రో సినిమా చేసి వ‌స్తాన‌న్నాడ‌ని, తామిద్ద‌రం క‌ల‌సి మాట్లాడుకున్నామ‌ని, ఈ స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింద‌ని చెప్పాడు. సో.. త్వ‌ర‌లోనే సుకుమార్‌తో మ‌హేష్ ఓ సినిమా చేస్తాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెఘాకు “రివర్స్ టెండరింగ్” పడుతోందిగా..!?

రోడ్లు, కాలువల నిర్మాణం... ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టుకుంటూ బడా సంస్థగా ఎదిగిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి రివర్స్ టెండరింగ్‌లో దక్కిన పోలవరం ప్రాజెక్ట్ పెనుభారంగా మారుతోంది. నిధులు వచ్చే దారి లేక..తన...

సీఎంల స్నేహం ప్రజలకు ఉపయోగపడలేదా..!?

హైదరాబాద్‌లో ఉంటూ పండుగకు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణం పెట్టుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పరిమితమైన ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. పండుగ సీజన్లో 80 శాతం ప్రయాణికుల అవసరాలు తీర్చే...

క్రెడిట్ బీజేపీకే..! ఏపీకి కేంద్రబృందం..!

వరదలు వచ్చాయి...పోయాయి. వరదలు వచ్చిన వారం రోజులకు సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. రెండు వారాలకు కేంద్ర బృందం ప్రకటన ఉంటుందని ప్రకటన వచ్చింది. మూడు వారాలకు వారు వచ్చి.. పరిశీలిస్తే.....

మీడియా వాచ్ : నిమ్మగడ్డపై దుమ్మెత్తి పోస్తున్న ఎన్టీవీ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాకా ఊదడానికి.. తెలుగుదేశం పార్టీపై పుకార్లు ప్రచారం చేయడానికి ఏ మాత్రం సంకోచించని ఎన్టీవీ... రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేయడానికి కూడా ఇప్పుడు వెనుకాడటం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌...

HOT NEWS

[X] Close
[X] Close