ఈ దసరాకి టీజర్లు, ఫస్ట్ లుక్, మోషన్పోస్టర్ల హడావుడి బాగానే సాగింది. గౌతమి పుత్ర శాతకర్ణి, థృవ టీజర్లు బయటకు వచ్చాయి. బాలయ్య, చరణ్ అభిమానుల పండగ సందడి రెట్టింపు చేశాయి. ఇక దీపావళి రాబోతోంది. దీపావళి కోసం స్టార్ కథానాయకులు కానుకలు సిద్దం చేస్తున్నారు. ఈ దీపావళికి చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం150 టీజర్‌ని చూపించే ఛాన్సుందని టాక్. చిరు.. గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా మహేష్ మాత్రం దీపావళి పటాసు పేల్చడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్ – మురుగదాస్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికి దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపావళికి టీజర్‌ని విడుదల చేసే ఛాన్సుందని టాక్. కనీసం పది సెకన్ల టీజర్‌ని చూపించాలని చిత్రబృందం భావిస్తోందట. టీజర్ కోసం మహేష్‌పై ఓ స్పెషల్ షూట్ కూడా నిర్వహించారని తెలుస్తోంది. టీజర్ విడుదల చేసేటప్పుడే టైటిల్ కూడా ప్రకటించాలని మురుగదాస్ ఆలోచన. అందుకే ప్రస్తుతం చిత్రబృందం ఈసినిమాకి సరిపడా టైటిల్‌ని అన్వేషిస్తోంది. వాస్కోడాగామా, ఎనిమీ లాంటి పేర్లు ఇది వరకే బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని చిత్రబృందం తోసి పుచ్చింది. మహేష్ టైటిల్ ఏంటన్న విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.