క్యాన్సర్ కారక ఉత్పత్తికి మహేష్ ప్రచారం ..వెల్లువెత్తుతున్న విమర్శలు !

డబ్బులిస్తే చాలు సినీ తారలు తమ అభిమానుల్ని ఎలాంటి ఉత్పత్తిని అయినా కొనుగోలు చేయమని ప్రొత్సహిస్తూ ప్రకటనల్లో నటిస్తూ ఉంటారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. వాణిజ్య ప్రకటనలకు ఎక్కువగా ఎండార్స్ చేసే నటులపై ఇలాంటి విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. మహేష్ బాబు అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. మహేష్ బాబు, బాలీవుడ్ యాక్టర్ టైగర్ పాన్ బహార్ అనే మౌత్ ఫ్రెష్‌నర్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్‌ను లగ్జరీగా చిత్రీకరించారు. ఆ పాన్ బహర్‌ మౌత్ ఫ్రెష్‌నర్‌ను తినడాన్ని హీరోయిజంగా ఎలివేట్ చేసారు. ఈ యాడ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పొగాకు, అల్కహాల్ ఉత్పత్తులకు డొంక తిరుగుడుగా ప్రచారం !

ఇండియాలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్ని నిషేధించారు. అలాగే అల్కహాల్ ప్రకటనల్ని కూడా. అందుకే ఆయా కంపెనీలన్నీ వేరే ప్రోడక్ట్స్‌ను ఆయా పేర్లతో తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు రాయల్ చాలెంజ్ యాడ్ మీకు ప్రతీ చోటా కనిపిస్తూ ఉంటుంది. రాయల్ చాలెంజ్ అంటే మద్యం అని మాత్రమే తెలుసు. యాడ్ చూసే వాళ్లకీ అదే అనిపిస్తుంది. కానీ చివరికి వారు చెప్పేది ఏమిటంటే అది మినరల్ వాటరో లేకపోతే మరో ఉనికిలో లేని ప్రోడక్టో అయి ఉంటుంది. పొగాకు ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు కూడా ఇదే బాట పట్టాయి. మాణిక్ చంద్ అనే కంపెనీ గోధుమపిండి అమ్ముతామంటూ ప్రచారం చేసుకుంటోంది. ఈ కోవలోనే పాన్ బహార్ కంపెనీ తమది మౌత్ ఫ్రెష్‌నర్ పేరుతో ప్రచారం చేస్తోంది.

పొగాకు ఉత్పత్తి అని చెప్పలేదని పాన్‌బహార్‌పై గతంలో కేసు వేసిన పియర్స్ బ్రాస్నన్..!

తమది మౌత్ ఫ్రెష్‌నర్ అని చెప్పి అంతర్జాతీయంగా ప్రచారం చేసుకునేందుకు గతంలోనే పాన్ బహార్ ఉత్పత్తి సంస్థ ప్రయత్నించింది. అందుకోసం ఏకంగా జేమ్స్ బాండ్ హీరోగా ప్రసిద్ధి చెందిన పియర్స్ బ్రాస్నన్‌తో ఒప్పందం చేసుకుంది. ఆయన యాడ్‌లో నటించారు. ఆయన పేరుతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. కానీ ఆయనపై విమర్శలు రావడంతో ఆయనతన ఒప్పందాన్ని సమీక్షించుకున్నారు. తాను ఎక్కడా పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. తనను పాన్ బహార్ కంపెనీ మోసం చేసిందని.. మౌత్ ఫ్రెష్‌నర్ పేరుతో పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారని గుర్తించారు. ఆ కంపెనీ ఉత్పత్తులు క్యాన్సర్ కారకమని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తన చిత్రాల్ని అనధికారికంగా ఉపయోగించుకున్నందుకు ఆసంస్థపై న్యాయపోరాటం కూడా ప్రారంభించారు.

పాన్ మసాలాలు ఆరోగ్యానికి తీవ్ర హానికరం.. !

నిజానికి పాన్ మసాలా, మౌత్ ఫ్రెష్‌నర్ పేరుతో అమ్ముతున్న ఉత్పత్తులు ప్రమాదకరమైనవి పలు వైద్యనివేదికల్లో వెల్లడయింది.ఊపిరితిత్తులు, కాలేయం, కడుపులో మానని గాయాలకు కారణం అవుతోంది. హెపాటోటాక్సిక్, ఎంజైమ్‌ల స్థాయిని, కార్బోహైడ్రేట్ మరియు లిపిడ్ జీవక్రియను నాశనంచేయడానికి కారణం అవుతుంది. మూత్రపిండాలతో పాటు లైంగిక సామర్థ్యం దెబ్బతీస్తుందని సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తుందని పలు నివేదికల్లో వెల్లడయింది.

అభిమానుల్ని క్యాన్సర్ కొనుక్కోవాలని ప్రచారం చేస్తారా..?

అయితే అలాంటి ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయడానికి ఆయా సంస్థలు అభిమానుల్లో క్రేజ్ ఉన్న వారికి కోట్లకు కోట్లు ఇస్తూంటాయి. వాటికి ఆశపడి ప్రకటనల్లో నటించడానికి నటులు సిద్ధమవుతారు. ఆ కారణంగా తమను అభిమానించే నటులు తమ అభిమానుల్ని ఇలా క్యాన్సర్ కారక ఉత్పత్తులపై వైపు మళ్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జేమ్స్ బాండ్ తెలుసుగోలిగారు కానీ ఇండియన్ బాండ్లు మాత్రం కోట్లతో సర్దుబాటు చేసేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు . ఉత్పత్తుల గురించి తెలుసుకోకుండా ప్రచారం చేయడం వల్ల అనేక మంది తారలు గతంలో ఇబ్బందులు పడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close