మ‌హేష్ ని జ‌క్క‌న్న ఎలా చూపించ‌బోతున్నాడు?

చిత్ర‌సీమ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ మ‌హేష్ బాబు – రాజ‌మౌళి. ప‌దేళ్ల క్రితం నుంచీ ఈ కాంబోపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. `చేద్దాం.. చేద్దాం` అని అటు రాజ‌మౌళి, ఇటు మ‌హేష్ చెబుతూనే వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు అది ఓకే అయ్యింది. `మ‌హేష్ తో సినిమా చేస్తున్నా. నా నెక్ట్స్ ప్రాజెక్టు అదే` అంటూ రాజ‌మౌళి చెప్ప‌డంతో మ‌హేష్ అభిమానుల్లో ఆనందం ఉర‌క‌లెత్తుతోంది. అయితే మ‌హేష్‌ని రాజ‌మౌళి ఎలా చూపించ‌బోతున్నాడు, ఎలాంటి క‌థ‌తో రాబోతున్నాడు? అనే ఊహాగానాలు అప్పుడే మొద‌లైపోయాయి కూడా.

ప‌దేళ్ల క్రితం… మ‌హేష్‌, రాజ‌మౌళి కాంబో రావాల్సింది. అప్పుడే వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చలు కూడా జ‌రిగాయి. కానీ మ‌హేష్ త‌న క‌మిట్స్‌మెంట్స్ వ‌ల్ల అప్పుడు చేయ‌లేక‌పోయాడు. ఆ త‌ర‌వాత కూడా సినిమా ఆశ‌లు చిగురించినా, కూర్చుని క‌థ గురించి చ‌ర్చించేంత అవ‌కాశం రాలేదు. కానీ ప‌దేళ్ల క్రితం మహేష్‌కి స్పై థ్రిల్ల‌ర్ వినిపించాడ‌ట‌. జేమ్స్ బాండ్ లాంటి క‌థ అది. అయితే అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా మార్పులొచ్చాయి రాజ‌మౌళి కూడా ఇంటర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్ లో ఆలోచించ‌డం మొద‌లెట్టాడు. తెలుగు మార్కెట్ స్థాయి పెరిగింది. అందుకే అప్ప‌టితో పోలిస్తే ఆ క‌థ‌ని ఇప్పుడు తీయ‌డ‌మే బెట‌ర్‌. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ప్రారంభ ప్రెస్ మీట్‌లో మ‌హేష్ తో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర ఎందుకు చేయించ‌ట్లేదు? అని ఓ పాత్రికేయుడు ప్ర‌శ్నిస్తే – `మ‌హేష్‌ని జెమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర‌లో చూపించాల‌నివుంది` అంటూ ఓ హింట్ కూడా ఇచ్చాడు. సో.. ఈసారి మ‌హేష్ కోసం రాజ‌మౌళి అలాంటి క‌థే రాసి ఉంటాడ‌న్న ఊహాగానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. ఈలోపు రాజ‌మౌళి ఆలోచ‌న‌ల్లో భారీ మార్పులొస్తే త‌ప్ప – మ‌హేష్ తో రాజ‌మౌళి జేమ్స్‌బాండ్ త‌ర‌హా సినిమా తీయ‌డం ఖాయ‌మన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజధాని తరలింపుపై కొత్త కదలికలు నిజమేనా..!?

రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు....

కాపు నేస్తం పథకం దుర్వినియోగం

కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును...

22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close