మ‌హేష్‌.. పూరీ… మాట్లాడేసుకున్నారా?

ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంలో పూరి జ‌గ‌న్నాథ్ మ‌హేష్‌పై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశాడు. హిట్టున్న ద‌ర్శ‌కుల‌తోనే మ‌హేష్ ప‌నిచేస్తాడ‌ని, ఈసారి మ‌హేష్ పిలిచినా – త‌ను త‌న‌తో సినిమా చేయ‌న‌ని తెగేసి చెప్పాడు. ఓ విధంగా మ‌హేష్‌ని ఒకింత ఇబ్బందికి గురి చేసే కామెంట్లే ఇవి. పూరి కామెంట్ల‌పై మ‌హేష్ త‌ప్ప‌కుండా స్పందిస్తాడ‌ని, పూరికి గ‌ట్టి కౌంట‌రే ఇస్తాడ‌ని మ‌హేష్ ఫ్యాన్స్ భావించారు. అయితే మ‌హేష్‌కి ఆ అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. అయితే ఈలోగానే మ‌హేష్‌, పూరి క‌లసిపోయార‌ని, ఇద్ద‌రూ మాట్లాడేసుకున్నార‌ని టాలీవుడ్ స‌మాచారం.

ఇస్మార్ట్ శంక‌ర్ చూసిన మ‌హేష్‌… పూరిని క‌బురంపాడ‌ని, ఈ సినిమా గురించి ఇద్ద‌రూ మాట్లాడుకున్నార‌ని.. మాట‌ల మ‌ధ్య‌లో పూరి చేసిన కామెంట్ల ప్ర‌స్తావ‌న ఎక్క‌డా రాలేద‌ని, దీన్ని బ‌ట్టి చూస్తే ఈ వ్య‌వ‌హారం మొత్తాన్ని మ‌హేష్ లైట్ తీసుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. చిత్ర‌సీమ‌లో ఈక్వేష‌న్లు ఎప్పుడైనా, ఎలాగైనా మారొచ్చు. ఇప్పుడు ఓ మాట అనేసుకున్నార‌ని గ్యాప్ పెర‌గ‌డం జ‌ర‌గ‌దు. క‌లిసున్నంత మాత్రాన.. ఇద్ద‌రి మ‌ధ్యా దూరం పెర‌గ‌ద‌నీ చెప్ప‌లేం. మ‌హేష్‌కి హిట్టు విలువ తెలుసు. పోకిరి త‌న కెరీర్‌కి ఎంత ప్ల‌స్స‌య్యిందో కూడా తెలుసు. పూరితో చిన్న‌పాటి గ్యాప్ వ‌చ్చిన మాట వాస్త‌వ‌మే. అయితే.. దాన్ని తానే ఇలా క్లియ‌ర్ చేసుకోవ‌డం మాత్రం మంచి స్టెప్పే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌డ‌న్ గా డ్రాప్ అయిన ద‌ర్శ‌కేంద్రుడు

`ఓం న‌మో వేంక‌టేశాయ‌` త‌ర‌వాత రాఘ‌వేంద్ర‌రావు మెగాఫోన్‌కి దూరం అయ్యారు. అదే ఆయ‌న చివ‌రి చిత్ర‌మ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ సినిమా ఫ్లాప్‌. ఓ పరాజ‌యంతో.. ఓ అద్భుత‌మైన కెరీర్‌కి...

అవ‌స‌రాల‌తో నాని?

న‌టుడిగా విభిన్న‌మైన మార్క్ సంపాదించుకున్నాడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌. ద‌ర్శ‌కుడిగానూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంటూనే ఉన్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ని తీస్తూ... మంచి పేరే తెచ్చుకున్నాడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే, జ్యో అత్యుతానంద చిత్రాలు...

బోయ‌పాటికి హీరోలు లేరా?

బోయ‌పాటి శ్రీ‌ను.. మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు. హీరోకి ఆయ‌న ఇచ్చే ఎలివేష‌న్స్ ఇంకెవ్వ‌రూ ఇవ్వ‌రు. రాజ‌మౌళి త‌ర‌వాత ఎమోష‌న్స్ క్యారీ చేయ‌డం దిట్ట‌.. బోయ‌పాటే. కాక‌పోతే.. ఇవ‌న్నీ సినిమా హిట్ట‌యిన‌ప్పుడే. సినిమా...

దుబ్బాకలో కేసీఆర్ ప్రచారం ..!?

దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నానని హరీష్ రావు చెబుతున్నారు. ఆ దిశగా ఆయన తనదైన శైలిలో వ్యూహం రచిస్తున్నారు. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close