త్రివిక్ర‌మ్ కోసం.. రిస్క్ చేస్తున్న మ‌హేష్

మ‌హేష్ బాబు చాలా జాగ్ర‌త్త ప‌రుడు. త‌న తొలి ప్రాధాన్యం… కుటుంబానికే. క‌రోనా స‌మ‌యంలో.. మ‌హేష్ చాలా కేర్ తీసుకున్నాడు. మిగిలిన హీరోలంతా షూటింగుల‌కు వ‌చ్చినా, మ‌హేష్ రాలేదు. స‌ర్కారు వారి పాట షూటింగ్ ఆల‌స్యం అవుతూ ఉండ‌డానికి మహేష్ తీసుకున్న ముందు జాగ్ర‌త్త లే కార‌ణం. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. అందుకే గోవాలో షూటింగ్ ని కాన్సిల్ చేసేశాడు మ‌హేష్‌. హైద‌రాబాద్‌లోనూ.. క‌రోనా కేసులు పెరుగుతున్న వేళ‌… `స‌ర్కారు వారి పాట‌` కొత్త షెడ్యూల్ మొద‌ల‌వ్వ‌డం క‌ష్ట‌మే అనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఉగాది రోజు నుంచి కొత్త షెడ్యూల్ కి శ్రీ‌కారం చుట్టారు. నెలాఖ‌రు వ‌ర‌కూ హైద‌రాబాద్ లోనే షూట్ చేయాల‌ని ఫిక్స‌య్యారు. ఈసారి మ‌హేష్‌నే… `త్వ‌ర‌గా ఫినిష్ చేద్దాం` అని ఆర్డ‌ర్ వేశాడ‌ట‌. దానికి కార‌ణం.. త్రివిక్ర‌మ్‌. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాని ప‌క్క‌న పెట్టి, మ‌హేష్ తో ప్రాజెక్టు చేయ‌డానికి ఫిక్స్ అయ్యాడు త్రివిక్ర‌మ్‌. `స‌ర్కారు వారి పాట‌` అయ్యేంత వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ ఖాళీగా ఉండాలి. త్రివిక్ర‌మ్ సినిమాకీ, ఆ త‌ర‌వాత రాజ‌మౌళి సినిమాకీ పెద్ద‌గా గ్యాప్ ఉండ‌దు. అందుకే.. స‌ర్కారు వారి పాట ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని మ‌హేష్ నిర్ణ‌యించుకున్నాడ‌ని తెలుస్తోంది. అందుకే క‌రోనా కేసులు ఎక్కువైనా.. ఈసారి మ‌హేష్ రిస్క్ చేయాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close