ఇది పోకిరి స్క్వేర్ అవుతుంద‌ని ముందే చెప్పా: మ‌హేష్‌

మ‌హ‌ర్షి సినిమా పై మ‌హేష్ బాబు ముందు నుంచీ న‌మ్మ‌కంతోనే ఉన్నాడు. ఆ న‌మ్మ‌క‌మే నిజ‌మైంది. ఈ సినిమా మ‌హేష్ బాబు గ‌త సినిమాల రికార్డుల‌న్నీ తిర‌గరాసింది. దాంతో మ‌హేష్ ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు. ఈ సినిమా ఇలాంటి విజ‌యం సాధిస్తుంద‌ని ముందే ఊహించాన‌ని అంటున్నాడు మ‌హేష్‌. ఈరోజు విజ‌య‌వాడ‌లో.. మ‌హ‌ర్షి విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ మాట్లాడుతూ “డెహ్రాడూన్‌లో తొలి రోజు షూటింగ్ అయిపోగానే ఈ సినిమా పోకిరి స్వ్కేర్ అవుతుంద‌ని ఊహించా. అది నిజ‌మైంది. ఈ సినిమాలో నా మూడు గెట‌ప్పులూ బాగా న‌చ్చాయి. అందులో స్టూడెంట్ పాత్ర చేయ‌డం మ‌రింత కిక్ ఇచ్చింది. నా సినిమా బాగా ఆడితే అభిమానులు ఎక్క‌డ కి తీసుకెళ్తారో నాకు తెలుసు. ఇది నా 25వ సినిమా. చాలా స్పెష‌ల్‌. నా పాత సినిమా రికార్డుల‌న్నీ తొలి వారంలోనే దాటించేసిన అభిమానుల‌కు స‌లాం” అని ఉద్వేగ భ‌రితంగా చెప్పాడు. త‌న‌తో తొలి సినిమా చేసిన రాఘ‌వేంద్ర‌రావుని ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు మ‌హేష్‌.

“రాజకుమారుడు స‌మ‌యంలో నాకేం తెలీదు. ఎలా న‌డ‌వాలో, ఎలా మాట్లాడాలో అర్థ‌మ‌య్యేవి కావు. సినిమా అంతా అయిపోయేంత వ‌ర‌కూ గంద‌ర‌గోళంగా ఉండేది. ఏంటిది మావ‌య్యా అని రాఘ‌వేంద్ర‌రావుగారిని అడిగాను. నువ్వేం కంగారు ప‌డ‌కు. ఈసినిమా సూప‌ర్ హిట్టు అవుతుంది. నువ్వు సూప‌ర్ స్టార్ అవుతావు అని ధైర్యం చెప్పారు. ఆయ‌న్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను” అన్నాడు. అలాగే విజ‌య‌వాడ గురించీ చెప్పుకొచ్చాడు. తానెప్పుడూ విజ‌య‌వాడ రావ‌డానికి ప్లాన్ చేసుకోన‌ని, త‌న సినిమా హిట్ట‌యిన త‌ర‌వాత బెజ‌వాడ దుర్గ‌మ్మే త‌న‌ని పిలుస్తుంద‌ని చెప్పుకొచ్చాడు మహేష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి అమ్మకం ఆస్తుల లిస్ట్ చాలా పెద్దదే..!?

తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ... అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని...

ప్రజల భాగస్వామ్యంతో.. “మన పాలన – మీ సూచన..!”

అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ...

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ... ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు...

ఇక పూరి.. ద‌బాంగ్‌!

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న‌ట్టు పూరి ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు...

HOT NEWS

[X] Close
[X] Close