హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖిల్’ఆడియోను అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఈ ఆదివారం విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియోను పవన్ కళ్యాణ్‌తో విడుదల చేయించటానికి చిత్ర నిర్మాత నితిన్ ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. దీంతో ఈ ఆడియో ఎవరు విడుదల చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. ఆ ఉత్కంఠ ఇప్పుడు వీడిపోయింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ ఆడియోను విడుదల చేయనున్నారు.
సాధారణంగా మహేష్ తమ కుటుంబానికి సంబంధించిన సినీ కార్యక్రమాలకు తప్పితే బయటవాటికి హాజరవరు. అయితే నాగార్జున కోరటంతో అఖిల్ ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవటానికి మహేష్ కాదనలేకపోయారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ఓ స్టేడియమ్లో ఘనంగా జరగబోతోంది. అఖిల్ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్‌ను సల్మాన్ గత నెల 29న విడుదల చేశారు.