‘బ్రహ్మోత్సవం’కుకూడా మహేష్ కో ప్రొడ్యూసర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. స్టార్ట్ చేయడం పాటతోనే స్టార్ట్ చేసిన సినిమా షూటింగ్ అద్భుతంగా నడుస్తుందట. మొన్నామధ్య కాస్త బ్రహ్మోత్సవం యూనిట్ కి బాలీవుడ్ తాకిడి ఎక్కువైనా అనుకున్నది అనుకున్నట్టుగా షూటింగ్ జరుగుతుందట. అయితే అయిపోయిన సంగీత్ సాంగ్ అదుర్స్ అనిపించేలా ఉందట. సాంగ్ రష్ చూసిన చిత్ర యూనిట్ సాంగ్ తోనే హిట్ కళ వచ్చిందని అంటున్నారట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలా ఈ సినిమాను కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

సాంగ్ సెట్ కోసం దాదాపు 3.50 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాపర్టీస్ వాడారట చిత్ర యూనిట్. సంగీత్ సాంగ్ కోసం సెట్ అంతా పూలతో నిడిపోయిందట. అందుకే బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సెట్ చూసి ఎక్స్ లెంట్ వర్క్ అని ప్రసంశించారట. మొత్తానికి శ్రీమంతుడుతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు కూడా మహేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. సో ఎం.బి ప్రొడక్షన్ ద్వారా వస్తున్న సెకండ్ మూవీగా బ్రహ్మోత్సవం స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమాను ముందుగా సంక్రాతికి రిలీజ్ చేద్దామనుకున్నా కుదిరేలా లేదని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close