‘మై అటల్‌ హు’ రివ్యూ: కవిగా ప్రధాని ప్రయాణం

”కొన్నిసార్లు రాజీయాల్లోకి ఎందుకొచ్చాననిపిస్తుంది. రాజనీతి కారణంగా ఒకరి ప్రాణం పోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు నాలోని కవి అలిసిపోతున్నాడు” ఒకానొక సందర్భంలో దేశానికి పదొవ ప్రధానిమంత్రిగా పని చేసిన అటల్ బిహారీ వాజ్‌పేయీ మనసులో నుంచి వచ్చిన మాటిది. ఈ మాటలో చాలా సంఘర్షణ వుంది. కవి హృదయం వుంది. ఈ సంఘర్షణని, సంఘటనల్ని, కవి మనసుని ‘మై అటల్‌ హూ’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రవి జాదవ్. ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరైన భారతరత్న, మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా, బాలీవుడ్‌ విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాఠి టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా విడుదలైయింది. బాల్యం నుంచి కార్గిల్ యుద్ధం వరకూ వాజ్‌పేయీ జీవితంలోని సంఘటనల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ బయోపిక్ లో విశేషాలు ఏమిటి? వాజ్‌పేయీ జీవితంలోని మలుపులు ఎన్ని? సామన్య మధ్యతరగతి కుటుంబం నుంచి దేశప్రధానిగా ఆయన ప్రయాణం ఎలా సాగింది?

కొందరి జీవితాల్ని సింహవలోకనం చేసుకుంటే ఒక్కటి కాదు అనేక సంఘటనలు కళ్ళముందు కదులుతాయి. ఆ సంఘటనలన్నీ విలువైనవే అనిపిస్తాయి. ‘మై అటల్‌ హూ’ దర్శకుడు రవి జాదవ్ కూడా వాజ్‌పేయీ జీవితంలో హైలెట్ అనుకున్న ప్రతి సంఘటనని ఇందులో చూపించే ప్రయత్నం చేసాడు. ప్రతిదాన్ని ఒక సీన్ లా కాకుండా హైలెట్స్ లా చకచక చెప్పుకుంటూ వెళ్ళాడు. బాల్యంలో వాజ్‌పేయీకి కవిత్వంపై ఆసక్తి, తాజ్ మహల్ పై చెప్పిన కవిత్వం, ఏదైనా అంశంపై అనర్గళంగా మాట్లాడే తీరు ఆయన ప్రయాణంపై ఆసక్తిని పెంచుతాయి. ఆర్.ఎస్‌.ఎస్‌ కార్యకర్తగా, న్యాయశాస్త్ర విద్యార్ధిగా, స్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికా సంపాదకుడిగా, చివరికి రాజకీయాల్లో రావడం.. ఈ ప్రయాణం అంతా పదునుగానే చూపించాడు దర్శకుడు. అయితే ఈ ప్రయాణం అర్ధం కావాలంటే అలనాటి రాజకీయాలు, ముఖ్యంగా ఆర్.ఎస్‌.ఎస్‌, భారతీయ జనసంఘ్ నేపధ్యాల గురించి ఎంతోకొంత తెలిసుండాలి. అలాగే గోల్వల్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ , దీనదయాళ్ ఉపాధ్యాయ లాంటి నాయకుల గురించి అవగాహన కలిగివుండాలి. అప్పుడే ఆ ప్రయాణం మరింత స్పష్టంగా అర్ధమౌతుంది.

సెకండ్ హాఫ్ లో స్వాతంత్ర అనంతర రాజకీయాలు వుంటాయి. శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జన్ సంఘ్ పూర్తి బాధ్య‌త‌ వాజ్‌పేయీ పై పడటం, అంతకుముందే బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడం, తొలిచూపులోనే పండిట్ నెహ్రూ, వాజ్‌పేయీ ప్రతిభని గుర్తించడం… ఇవన్నీ ఆసక్తికరంగా తీశాడు దర్శకుడు. పండిట్ నెహ్రూ సమక్షంలో వాజ్‌పేయీ ఇచ్చిన ప్రసంగం ఆయనలోని గొప్ప వక్తకు అద్దం పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్ గా సాగుతుంది. భారత రాజకీయ చరిత్రలో కీలకమైన ఘట్టాలన్నీటిని హైలెట్స్ గా చూపించుకుంటూ వెళ్లారు. గాంధీ, నెహ్రూ, లాల్ బహుదూర్ మరణం, ఇందిరా ప్రధాని కావడం, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ, ఇందిరా హత్య, రాజీవ్ ప్రధాని కావడం, జానతా ప్రభుత్వం ఏర్పాటు, బాబ్రీ అల్లర్లు, బిజెపి ఆవిర్భావం, ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోవడం, ప్రధానులు మారిపోవడం.. ఇలా అనేక సంఘటనలు వచ్చిపడతాయి. వీటిపై అవగాహన వుంటే ఇది ఫలానా సందర్భం అని అర్ధమౌతుంది. లేనిపక్షంలో అంతా గంద‌రగోళంగా వుండే అవకాశం వుంది.

దర్శకుడు రవి జాదవ్, ఈ చిత్రాన్ని వాజ్‌పేయీ కి నివాళి అర్పించేలా తీశాడు. సినిమా ఆద్యంతం వాజ్‌పేయీ ప్రతి అడుగు, మాటలో ప్రేమ, వాత్సల్యం, స్నేహం ప్రతిధ్వనిస్తుంటాయి. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఐక్యరాజ్య సమితిలో వాజ్‌పేయీ చేసిన వసుధైక కుటుంబ ప్రసంగం కదిలిస్తుంది. పార్లమెంట్ లోని తన కార్యాలయంలో వుండే నెహ్రూ ఫోటోని ప్రతిపక్షం నేత అనే నెపంతో సిబ్బంది తొలిగించిననప్పుడు.. ”ఆయన ప్రధానిగా వునప్పుడు మనం ప్రతిపక్షంలో వున్నాం. ఆయన మన దేశానికి తొలి ప్రధాని. మర్యాదగా ఆయన ఫోటోని అక్కడి పెట్టి ఆయనకి రెండు చేతులు జోడించి పార్లమెంట్ లో అడుగుపెట్టండి” అని అధికారులతో చెప్పిన సన్నివేశం ఆయనలో హుందాతనానికి అద్దంపడుతుంది.

నిజానికి ప్రధాని కావాలనే ఆలోచన వాజ్‌పేయీకి లేదు. ఒక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తారు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా వుంటారు. మిగిలిన జీవితం కవిగా బ్రతకాలనుకొంటారు. ఇలాంటి దశలో ఓ సభలో ప్రధాని అభ్యర్ధిగా ఆయనపేరు ప్రకటిస్తారు అద్వాని. ‘అందరినీ అడిగాం, మీ పేరే చెప్తున్నారు” అని వాజ్‌పేయీ చెవిలో చెప్తారు అద్వాని. ‘అందరినీ అడిగారు సరే..నన్ను అడగాల్సింది”అని వాజ్‌పేయీ ఇచ్చిన సమాధానం ఆయనకు పదవులపై అంత వ్యామోహం లేదనే విషయాన్ని ఈ సన్నివేశం ద్వారా చిత్రీకరించాడు దర్శకుడు. అలాగే ఒక్క సీటుతో ప్రభుత్వం పడిపోయినపుడు.. ఆయన స్పందించిన తీరు కూడా గొప్పగా వుంటుంది. కార్గిల్ వార్ ని క్లైమాక్స్ గా చూపించారు. ఇందులో వార్ ని చిత్రీకరించలేదు కానీ వాజ్‌పేయీలోని ఓ హీరోయిక్ క్యాలిటీని చూపించారు. ప్రధాని కార్యాలయానికి అమెరికా ప్రెసిడెంట్ పాకిస్థాన్ తో రాజీపడమని కాల్ చేస్తే.. ‘పాకిస్థాన్ ప్రధానికి చెప్పండి. భారత ప్రధాని యుద్ధం గెలిచిన తర్వాతే మాట్లాడతాడు’ అని వాజ్‌పేయీ సమాధానం చెప్పడం రోమాంచితంగా వుంటుంది. అయితే వాజ్‌పేయీ కి నివాళిగా మలిచిన ఈ చిత్రంలో సహజంగానే కాంగ్రెస్ వాయిస్ వినిపించదు. అలాగని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బ్యాడ్ లైట్ లో చూపించే వ్యవహారం కూడా వుండదు. సహజంగా వినిపించే రాజకీయ విమర్శలే క‌నిపిస్తాయి.

పంకజ్‌ త్రిపాఠి, వాజ్‌పేయీ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన ఎక్స్ ప్రెషన్, మాట తీరుని దాదాపుగా మ్యాచ్ చేశాడు. వాజ్‌పేయీ మంచి వక్త కానీ పాజ్ ఇచ్చి మాట్లాడటం ఆయన స్టయిల్. దాన్ని చక్కగా పట్టుకున్నాడు. భావవ్యక్తీకరణ చాలా హుందాగా వుంటుంది. సన్నివేశాలు ఏవో హైలెట్స్ లా సాగిపోతున్నప్పటికీ పంకజ్‌ నటన లీనం చేస్తుంది. వాజ్‌పేయీ బ్రహ్మచారి. కానీ కాలేజ్ చదువుకున్న రోజుల్లో రాజ్ కుమారి అనే అమ్మాయిని ఇష్టపడతారు. నిజానికి రాజ్ కుమారికి ఆ సంగతే తెలీదు. ఆమె కొన్ని కారణాల వేరే ఊరు వెళిపోతుంది. అక్కడితో ఆ కథ ముగిసిపోతుంది. కానీ అదే రాజ్ కుమారి కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ స్నేహితురాలిగా పరిచయమౌతుంది. వారి మధ్య స్నేహ బంధాన్ని చాలా హుందాగా చిత్రీకరించాడు దర్శకుడు. ఇందులో చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలు వారికి దగ్గర పోలికలు వున్న నటులతో చేయించారు. కొన్ని దశబ్దాల‌ ప్రయాణం వున్న చిత్రమిది. కాలానికి తగ్గట్టుగా విజువల్స్, ఆర్ట్ వర్క్ డీసెంట్ గానే వుంటుంది. చాలా మంచి మాటలు రాసుకున్నారు. వాజ్‌పేయీ ప్రతి మాటలో కవిత్వం, గొప్ప భావం వినిపిస్తుంది. నేపధ్య సంగీతంలో వచ్చే ఫ్లూట్ బిట్ బావుంటుంది. దర్శకుడు కథనాన్ని చాలా సింపుల్ గా ఒక చరిత్ర చూపిస్తున్నట్లు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఓటీటీలో వుంది కాబట్టి వాజ్‌పేయీ జీవితం, రాజకీయాలపై ఆసక్తి వున్నవారు ఓసారి చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close