మజిలీ : ఎమోషనల్ మెలోడ్రామా

తెలుగు360 రేటింగ్‌ 3/5

చాలా కాలంగా మహిళా ప్రేక్షకులు టీవీ వదలి థియేటర్ కు రావడం అరుదు అయిపోయింది. మహిళలను రప్పించాలంటే ఎమోషనల్ కథలు, మెలో డ్రామా నిండిన సీన్లు తప్పవు అని మేకర్లకు అర్థం అయిపోయింది. అది అత్తారింటికి దారేది కావచ్చు, రంగస్థలం కావచ్చు. సక్సెస్ మంత్ర అయితే ఒకటే. ఎమోషనల్ సినిమాలో ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ ఛేయడం.

భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే అన్న పాయింట్ తో నిన్ను కోరి సినిమా తీసి మెప్పించిన శివనిర్వాణ మళ్లీ అదే పాయింట్ తో కొత్త సినిమా కథ అల్లాడు. గతంలో వచ్చిన సాగరసంగమం గుర్తుకు వచ్చేలా దానికి ట్రీట్ మెంట్ అద్దాడు. ఆ పాయింట్, ఈ ట్రీట్ మెంట్ కలిసి సినిమాను ఎలా తయారుచేసాయో చూద్దాం.

పూర్ణ (చైతన్య) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. మాంచి క్రికెటర్ కావాలనే కల. అలాంటి వాడి జీవితం అంషు (దివ్వాంశ) పరిచయంతో అంతా మారిపోతుంది. ఆమె ప్రేమ కారణంగా అతను రకరకాల వ్యవహారాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో అక్కరలేని అలవాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి టైమ్ లో ఆమె దూరం అవుతుంది. దీంతో ఇతగాడు సర్వం వదిలేసి తాగడమే జీవితం అన్నట్లు మారిపోతాడు. భార్య శ్రావణి (సమంత) సంగతే పట్టదు. అలాంటి వాడి జీవితంలోకి మళ్లీ అంషు పరోక్షంగా ప్రవేశిస్తుంది. అదెలా? అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

మెలోడ్రామా ఎక్కడో వుండదు, మన జీవితాల్లోనే వుంటుంది అంటాడు యండమూరి రవీంద్రనాథ్. ఈ సినిమా అచ్చంగా అలాగే వుంటుంది. పూర్ణ అనే వాడి జీవితం ఎన్ని మలుపులు, ఎన్ని మిట్టపల్లాలు తిరిగింది అన్నది చూస్తే. క్రికెటర్ కావాలనుకోవడం, అదే టైమ్ లో ప్రేమలో పడడం, దానివల్ల గొడవలు, ప్రేమ విఫలం కావడం, పెళ్లి, భార్యపై అనాసక్తి, ఆపైన మళ్లీ క్రికెట్ పై ఆసక్తి ఇలా రకరకాల అప్ అండ్ డౌన్స్ సినిమాలో కనిపిస్తాయి. అయితే ఈ అప్ అండ్ డౌన్స్ మధ్య రాసుకున్న కథ, తీసుకున్న సీన్లు తొలిసగంలో ఒకలా మలిసగంలో మరోలా వుంటాయి.

సినిమా తొలిసగం చాలా జోష్ తో టేకాప్ తీసుకుంటుంది. నాచురల్ లోకేషన్లలో, సహజమైన లుక్స్, చిత్రీకరణతో యూత్ ను ఆకట్టుకునేలా వుంటుంది. అలా అలా నవ్వులు పండిస్తూ చకచకా ముందుకు సాగిన సినిమా హీరో ప్రేమలో పడిన తరువాత కాస్త నెమ్మదిస్తుంది. డైరక్టర్ స్పెషాలిటీ ఏమిటంటే, సన్నివేశాలతో సంబంధం లేకుండా, వీలయినదగ్గరల్లా స్పార్క్ ల్లా చిన్నగా అయినా ఫన్ పండించే ప్రయత్నం చేయడం. అయితే కొన్ని చోట్ల డైరక్టర్ ఎంచుకున్న డిటైల్డ్ నెరేషన్ అన్నది కాస్త ఇబ్బంది పెడుతుంది. అందువల్ల సినిమా వేగం నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. అలా ముందుకు సాగిన సినిమా రెండో కథానాయిక సమంత ఎంట్రీతో ఇంట్రవెల్ బ్యాంగ్ కు వస్తుంది. ఇక్కడ బ్యాంగ్ కోసం తీసిన సీన్ కాస్త జంప్ అనిపిస్తుంది. కాస్త ఆలోచిస్తే తప్ప, అది కూడా సినిమా చాలా వరకు ముందుకు జరిగాక కానీ, అది జంప్ కాదని, దాని వెనుక వున్న రీజన్ ఇది అని అర్థం కాదు.

సినిమా ద్వితీయార్థంలో ప్రవేశించాక, ఎమోషనల్ డోస్ పెంచాడు దర్శకుడు. హీరో లైఫ్ ను పాజిటవ్ టర్న్ కు మార్చడం కోసం హీరోయిన్ కూతురు అనే పాయింట్ ను కాస్త బలవంతగానే చొప్పించినట్లు అనిపిస్తుంది. పైగా 13ఏళ్లకు పైగా వయసు వున్న కూతురులా కనిపిస్తుంది ఆ అమ్మాయి. కానీ హీరో ప్రేమ వ్యవహారం, పెళ్లి వైనం వీటన్నింటి మధ్య వున్న గ్యాప్ 13 ఏళ్లు వున్నట్లు అనిపించదు. ఎవరి లుక్ లు అంతగా మారవు. సంఘనటలు జరిగి ఎక్కువ కాలం అయినట్లు నెరేషన్ వుండదు. కానీ 13ఏళ్ల అమ్మాయి సీన్లోకి ఎంట్రీ అవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే, ద్వితీయార్థం మొత్తాన్ని సమంత, రావు రమేష్ కలిసి నిలబెట్టారనే చెప్పాలి.

సీనియర్ యాక్టర్ గా రావు రమేష్ హీరోయిన్ సమంతకు మంచి సపోర్ట్ గా నిలిచాడు. అన్ని విధాలా అన్ని కోణాల్లో పెయిన్ ఫీలయ్యే పాత్రలో సమంత చాలా బాగా చేసింది. ఈ సినిమా ఆమె ఎందుకు అంగీకరించిందో సినిమా చూసాక తెలుస్తుంది. అయితే అంత ఫెర్ ఫార్మర్, అంత బరువైన పాత్ర చుట్టూ మరింగ గట్టిగా కథ/సన్నివేశాలు అల్లుకుని వుంటే ఇంకా బాగుండేది. క్లయిమాక్స్ కు దారితీసిన రీజన్ కూడా మరీ బలంగా ఏమీ లేదు. అయితే దర్శకుడు చాలా సీన్లను డైలాగులతో నిలబెట్టాడు.

వీలయినంత వరకు ఫన్ స్పార్క్ లు మిస్ కాకుండా చూసుకోవడం, సంభాషణలు బాగా రాసుకోవడం, సమంత, రావురమేష్, చైతన్య తదితరుల పెర్ ఫార్మెన్స్ వంటివి అన్నీ కలిసి సినిమాను విజయతీరం దిశగా నడిపించాయి.

సమంత మంచి నటి అని ఇప్పటికే ఒకటి రెండుసార్లు ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు. మరోసారి రుజువు చేసుకుంది. నాగ్ చైతన్య కూడా ఫస్ట్ సీన్ నుంచి డిఫరెంట్ పెర్ ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. రావు రమేష్,పోసాని వంటి వాళ్లే కాదు, ఫ్రెండ్స్ గా నటించిన చిన్న నటులు కూడా మంచి నటన అందించారు.

కాపీ ట్యూన్లు అనిపించేవే అయినా క్యాచీ ట్యూన్లు ఇచ్చాడు గోపీసుందర్. ప్రియతమా పాట కొన్నాళ్లు వినిపిస్తుంది. థమన్ నేపథ్యసంగీతం బాగుంది.

సినిమాను నాచురల్ లోకేషన్లు, నాచురల్ ప్రాపర్టీస్ మధ్య తీయడంతో ఫొటోగ్రఫీ నార్మల్ గా వున్నట్లు అనిపిస్తుంది కానీ, అది కూడా బాగుంది.

మొత్తం మీద చూసుకుంటే హిట్ మజిలీని సినిమా చేరుకున్నట్లే.

ఫైనల్ టచ్…మోడరన్ సాగరసంగమం

తెలుగు360 రేటింగ్‌ 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

దూబే హతం..! బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే ఆన్సర్..!

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతనిని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. మరో విమర్శకు తావివ్వకుండా...యూపీ శివార్లలోనే ఎన్‌కౌంటర్ చేసేశారు. డీఎస్పీ...

ఎడిటర్స్‌ కామెంట్ : తెలంగాణ ప్రజలకు శాపమే..!

" నేను ఎక్కడ ఉంటే అదే సచివాలయం.. ముఖ్యమత్రి అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ..!" .. అంటూ... రెండో సారి గెలిచిన సమయంలో మీడియాతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీని నేపధ్యం.. కేసీఆర్ అసలు...

HOT NEWS

[X] Close
[X] Close