డింపుల్.. వ‌ద్దు బాబోయ్‌!

ఖిలాడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హ‌య‌తి. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే డింపుల్ పై ఫోక‌స్ పెట్టారు టాలీవుడ్ జ‌నాలు. ఖిలాడి బాగా వ‌చ్చింద‌ని, అందులో డింపుల్ గ్లామ‌ర్ హొయ‌లు పోయింద‌న్న వార్త‌లు రావ‌డంతో… డింపుల్ ని ఎంచుకుందామ‌న్న ఆలోచ‌న‌లు నిర్మాత‌లు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూశారు. దానికి త‌గ్గ‌ట్టు.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా డింపుల్ చిట్టి పొట్టి దుస్తుల‌తో ద‌ర్శ‌న‌మిచ్చేది. లిప్ లాకుల‌కు కూడా అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని తెలియ‌డంతో… కొంత‌మంది నిర్మాత‌లు క‌ర్చీఫులు రెడీ చేశారు. గోపీచంద్ – శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో క‌థానాయిక‌గా ముందు డింపుల్ అనే అనుకున్నారు. అయితే `ఖిలాడి` వ‌చ్చాక‌, ఆ సినిమా చూసి ఫిక్స్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఖిలాడి విడుద‌లైంది.

ఈ సినిమాలో.. డింపుల్ హ‌య‌త్ స్కిన్ షోతో.. రెచ్చిపోయిన‌ప్ప‌టికీ, త‌న‌కు ఏమాత్రం మార్కులు ప‌డ‌లేదు. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం బాగోక‌పోవ‌డం, హీరోయిన్ కి త‌క్కువ‌, ఐటెమ్ గాళ్ కి ఎక్కువ అన్న‌ట్టు ఆ పాత్ర క‌నిపించ‌డంతో.. ఇప్పుడు నిర్మాత‌లు లైట్ తీసుకోవ‌డం మొద‌లెట్టారు. గోపీచంద్ సినిమాలో క‌థానాయిక‌గా అనుకున్న‌ప్ప‌టికీ, ఇప్పుడు ఈ ఆప్ష‌న్‌ని నిర్మాత‌లు ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో మ‌రో కొత్త‌మ్మాయి కోసం చిత్ర‌బృందం అన్వేష‌ణ మొద‌లెట్టింది. ఒక‌రిద్ద‌రు నిర్మాత‌లు కూడా డింపుల్ కి అడ్వాన్సు ఇవ్వ‌బోయి.. ఖిలాడి చూశాక మ‌న‌సు మార్చుకున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close