ప్ర‌మోష‌న్లు షురూ..!

సినిమా అంటే ఎంతో హ‌డావుడి. ఓపెనింగ్స్‌, ఆడియో ఫంక్ష‌న్లు, టీజ‌ర్ రిలీజ్‌.. ప్ర‌తీదీ ఓ పండ‌గ‌లా చేస్తుంటారు. సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్ల‌తో హోరెత్తిస్తుంటారు. క‌రోనా వ‌ల్ల‌.. గ‌త రెండు నెల‌లుగా చిత్ర‌సీమ‌లో ఎలాంటి హ‌డావుడీ లేదు. కొత్త సినిమాల క్లాపులు లేవు, టీజ‌ర్లు లేవు, పోస్ట‌ర్లు లేవు, పాట‌లు లేవు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ హ‌డావుడి క‌నిపించ‌బోతోంది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నులు ప్రారంభించుకోవ‌డానికీ, చిత్రీక‌ర‌ణ‌లు జ‌రుపుకోవ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చేస్తోంది. రేపో.. మాపో థియేట‌ర్లు కూడా రెడీ అయిపోతాయి. ఈ ఉత్సాహంలోనే సినిమా ప్ర‌మోష‌న్ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మెల్ల‌మెల్ల‌గా త‌మ సినిమాల్ని జ‌నం ముందుకు తీసుకురావ‌డానికి స‌మాయాత్తం అవుతున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రం `సోలో లైఫే సో బెట‌ర్‌`. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ `నో పెళ్లి` ఈ సోమ‌వారం విడుద‌ల కానుంది. రంజాన్ సంద‌ర్భంగా తేజ్‌సినిమా ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్టారు. మెల్ల‌మెల్ల‌గా మిగిలిన సినిమాల ప్ర‌మోష‌న్లూ మొద‌లైపోతాయి. `వీ` కూడా అప్పుడ‌ప్పుడూ పోస్ట‌రో, పాటో బ‌య‌ట‌కు వ‌దులుతోంది. `నిశ్శ‌బ్దం`, `ఉప్పెన‌` లాంటి సినిమాలు ఇప్పుడు ఇదే దారిలో న‌డ‌వ‌బోతున్నాయి. మొత్తానికి మ‌ళ్లీ.. సినిమాకి కొత్త ఉత్సాహం వ‌చ్చింది. థియేట‌ర్లు కూడా తెరిస్తే.. ఇంకా హ్యాపీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో 'న‌మ్మిన బంటు' సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే...

HOT NEWS

[X] Close
[X] Close