2017లో ప్రముఖ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్ కేసులో నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న మలయాళ హీరో దిలీప్ ఇప్పుడు నిర్దాషిగా బయటపడ్డారు. ఆ కేసులో ఆయన నాలుగు నెలల పాటు జైల్లో ఉన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కెరీర్లోనూ ఈ కేసు కారణంగా ఇబ్బందులు పడ్డారు.
2017లో తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన మలయాళ హీరోయిన్ ను కొంత మంది గ్యాంగ్ రేప్ చేసినట్లుగా కేసులు నమోదు అయింది. షూటింగ్ నుంచి వెళ్తున్న సమయంలో కారులో తీసుకెళ్లిన దుండగులు ఈ పనికి పాల్పడ్డారని ఆమె కేసు పెట్టారు. ఆ దుండగుల వెనుక దిలీప్ ఉన్నారని ఆ హీరోయిన్ ఆరోపించారు. దిలీప్‌కు ఫ్యామిలీ వివాదాలు ఉన్నాయి. మరో హీరోయిన్ అయిన భార్యతో విడిపోయారు. ఈ క్రమంలో దిలీప్ టార్గెట్ అయ్యారు.
తనను తప్పుడు ఆరోపణలతో కేసులో ఇరికించారని సీబీఐ దర్యాప్తు చేయించాలని అప్పట్లో దిలీప్ కోరారు. కానీ కేరళ పోలీసులే దర్యాప్తు చేశారు . ఇన్నేళ్ల తర్వాత కేసులో ఆయన ప్రమేయం లేనట్లుగా కోర్టు నిర్దారించింది. కానీ ఆయన మాత్రం నష్టపోయారు. ఆ హీరోయిన్ కూడా వ్యక్తిగతంగా దిలీప్ పై ఆరోపణలు చేశారు.
