అపార్టుమెంట్ జీవితాలు కొంత మందికి చిరాకు తెప్పిస్తాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న హైరైజ్ అపార్టుమెంట్లలో ఇండిపెండెంట్ హౌస్లా ప్రైవసీ ఉంటున్నప్పటికీ వాటిని అందుకోవడం మధ్యతరగతికి సాధ్యంకాదు. అందుకే కాస్త శివారుకు వెళ్లినా ఇండిపెండెంట్ హౌస్లను కొనుగోలు చేయాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఒకటి మల్లంపేట.
మల్లంపేట హైదరాబాద్లోని ఉత్తర-పశ్చిమ జోన్లో ఉంది. ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. గతంలో నిర్మానుష్యంగా ఉండేది కానీ గత పదేళ్లలో కాలనీలు పెరిగాయి. పెద్ద పెద్ద రియల్ కంపెనీలు కూడా ప్రాజెక్టులు ప్రారంభించాయి. పలు కాలనీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఇక్కడ చదరపు గజం స్థలం పదిహేను వేల నుంచి పాతిక వేల వరకూ లభిస్తోంది. స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుంటే..అరవై లక్షలతో విశాలమైన ఇల్లు సొంతమవుతుంది. స్థానిక బిల్జర్లు ఇళ్లు కట్టిఅమ్ముతూ ఉంటారు. ఇవి 70 లక్షల నుంచి అందుబాటులో ఉంటున్నాయి.
కాస్త ఎక్కువ ధర పెట్టగలిగే వాళ్ల కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు .. విల్లాలు నిర్మిస్తున్నాయి. పేరుకు విల్లాలే అయినా ఇవి ఇండిపెండెంట్ హౌస్ల సమూహం అనుకోవచ్చు. సౌకర్యాలు ఉంటాయి.. గేటెడ్ కమ్యూనిటీ భద్రత ఉంటుంది. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, కొత్త నివాస మరియు వాణిజ్య ప్రాజెక్టులు రాబోయే 5-10 సంవత్సరాల్లో పదిహేను నుంచి ఇరవై శాతం వరకూ రిటర్న్స్ ఉంటాయని భావిస్తున్నారు. అద్దెల ఆదాయం కూడా పెరుగుతోంది.