టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం అంచనాలు మాత్రమే చెబుతున్నారని అదే వీడియోలో ఉంది. అంటే పీకే తన అంచనాలను చెబుతున్నారు. మరి దీదీకి… వైసీపీకి ఆక్రోశం ఎందుకు ?. ఇక్కడే సిమిలారిటీ ఉంది.
బెంగాల్ లో నూ బీజేపీ ఈ సారి మెజార్టీ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ తన అంచనాకు చెబుతున్నారు. ఇది మమతా బెనర్జీకి కోపం తెప్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని తట్టుకోవడం కష్టమని అనుకుంటున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ బెంగాల్ లో తృణమూల్ కు పని చేశారు. ఆమె గెలిచారు. అప్పట్లో బీజేపీ చేసే ప్రచారాలకు ప్రశాంత్ కిషోర్ గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు. చాలా సర్వేలు బీజేపీకి అనుకూలంగా వస్తే .. పీకేనే.. బీజేపీ గెలవదని చాలెంజ్ చేసేవారు. ఫలితాలు పీకే చెప్పినట్లుగా వచ్చాయి. అయితే ఆ తర్వాత పీకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పనులు మానేశారు.
ఇప్పుడు బెంగాల్ లో దీదీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది నిజం. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని కూడాసర్వేలు చెబుతున్నాయి. శాంతిభద్రతల సమస్యలు.. కమ్యూనిస్టు క్యాడర్ దీదీని ఓడించడానికైనా బీజేపీకి ఓటేయడానికి సిద్ధపడటం.. సమస్యగా మారింది. సందేశ్ ఖాళీ పేరుతో జరిగిన రచ్చ మరింత డ్యామేజ్. ఈ కారణాలతో అక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందంటున్నారు. పీకే ఇదే చెబితే.. ఆమె ఎదురుదాడి చేస్తున్నరు.
ఏపీలోనూ వైసీపీకి పని చేసిన ఆయన ఇప్పుడు అక్కడ జగన్ ఘోరంగా ఓడిపోతున్నారని విశ్లేషిస్తున్నారు. అందుకే వైసీపీ కూడా ఆయనపై బూతులందుకుంటోంది. అటు మమతాది.. ఇటు జగన్ ది.. ఒకటే బాధ. తమకు పని చేసి గెలిపిచంిన పీకే.. ఇప్పుడు తాము ఓడిపోతున్నామని చెప్పడం భరించలేకపోతున్నారు. ఆయనపైనే బురద చల్లుతున్నారు. ఆయన అంచనాల్లో ఎంత నిజముందో ఫలితాలే నిర్ణయిస్తాయి.