దీదీ కాన్సెప్ట్ : దేశానికి నాలుగు రాజధానులు..!

ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దీని ప్రకారం మరి 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఎన్ని రాజధానులు ఉండాలి..? . ఈ చర్చ నిన్నామొన్నటిదాకా ఏపీలో… జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించడానికి జరిగింది. కానీ ఇప్పుడు ఇది దేశవ్యాప్తం అవుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. దేశానికి నాలుగు రాజధానుల అవసరం ఉందని ప్రకటించారు. బెంగాల్లో ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన 125 జయంతిని ఎవరికి వారు ఘనంగా నిర్వహించి.. ప్రజల్లో సెంటిమెంటల్ సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగా ప్రధాని మోడీ స్వయంగా బెంగాల్ పర్యటనకు వెళ్లారు. అక్కడో ర్యాలీలో పాల్గొంటున్నారు. మమతా బెనర్జీ కూడా పోటీ ర్యాలీ నిర్వహించింది. అంత వరకూ బాగానే ఉన్నా.. ఆ ర్యాలీలోనే నాలుగు రాజధానులు ప్రస్తావన తెచ్చారు. బ్రిటిష్ వారి హయాంలో దేశం మొత్తం పాలనా కేంద్రం కోల్ కతాలోనే ఉండేదని ఆమె అంటున్నారు. ఇంత సువిశాల భారత దేశాన్ని పరిపాలించడానికి.. ఒక్క రాజధాని సరిపోదని నాలుగు రాజధానులు ఉండాల్సిందేనని అంటున్నారు. నాలుగు చోట్లా… పార్లమెంట్ సమావేశాలు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయాలన్న డిమాండ్ కొన్ని వర్గాల్లో వినిపిస్తూ ఉండేది.

అయితే అది జాతీయ. స్థాయిలో కాదు.. లోకల్‌లోనే . ఇప్పుడు.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటైతే… ఆ నైతిక మద్దతుతో … దేశానికి నాలుగు రాజధానుల డిమాండ్ ను రాజకీయ పార్టీలు వినిపించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రంగా ఉండే కోల్ కతాలోనూ ఈ డిమాండ్ మరింత ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడే.. మమతా బెనర్జీ ఈ అంశాన్ని టేకప్ చేశారు. ఎంత సీరియస్ గా ముందుగా తీసుకెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close