ప్రొ.నాగేశ్వర్ : జాతీయ నేతల ప్రచారంతో చంద్రబాబుకు లాభమేనా..?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాం జోరుగా నిర్వహిస్తున్నారు. తాను మాత్రమే కాదు.. ఇతర జాతీయ పార్టీల నేతల్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు .. మరికొంత మందిని ప్రచారానికి ఉపయోగించుకునేందుకు షెడ్యూల్ రెడీ చేశారు. ఇలా ఇతర రాష్ట్రాలు, పార్టీల నేతల్ని… ప్రచారానికి ఉపయోగించుకునేందుకు… చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

జాతీయ నేతల్ని వ్యూహాత్మకంగా ప్రచారానికి తీసుకెళ్తున్న చంద్రబాబు.. !

తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వస్తున్న వారు… జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలు. వారి పార్టీలు జాతీయ పార్టీలు అయినా కాకపోయినా.. వారికి గుర్తింపు ఉంది. వారిని ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి తీసుకొచ్చిన చంద్రబాబు … ఓ లెక్క ప్రకారం.. ప్రచారం చేయించుకుంటున్నారు. పరూక్ అబ్దుల్లాతో … కర్నూలు జిల్లాలో ప్రచారం చేయించుకున్నారు. రాయలసీమలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారు కోస్తా ముస్లింల కన్నా భిన్నంగా ఉంటారు. అందుకే అక్కడ ఫరూక్ అబ్దుల్లాను ప్రయోగించారు. మమతా బెనర్జీని విశాఖ తీసుకెళ్లారు. ఎందుకంటే.. అక్కడ చాలా పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్. బీహెచ్‌పీవీ లాంటి సంస్థలు ఉన్నాయి. అక్కడ బెంగాలీ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది. ఉత్తరాది ఓటర్ల కోసం.. కేజ్రీవాల్‌తో ప్రచారం చేశారు. కేజ్రీవాల్ ప్రచారం… ఉన్నత విద్యావంతుల్లో, ఉత్తరాది ఓటర్లలో ప్రభావం చూపిస్తుంది. అఖిలేష్ యాదవ్ వస్తారంటున్నారు. యాదవ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట.. అఖిలేష్‌తో ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని బట్టి ఆయా నేతలతో ప్రచారం చేయించుకుని… చంద్రబాబు తెలివిగా వ్యవహరిస్తున్నారు.

జగన్‌కు కేసీఆర్ ఒక్కడే.. తన వెనుక పార్టీలన్నీ ఉన్నాయని నిరూపిస్తున్న చంద్రబాబు..!

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించాలంటే… ఒక్కరిగా సాధ్యం కాదు. అందర్నీ కూడగట్టుకుని వారి మద్దతు సంపాదించాలి. గతంలో చంద్రబాబు.. బీజేపీతో పొత్తు పెట్టుకుని… విభజన హామీలు నెరవేరుస్తామన్నారు. అది ప్రజలకు కనెక్ట్ అయింది. కేంద్రం అండ లేకపోతే.. ఏపీ నిలబడటం కష్టం అనే భావన అప్పట్లో ప్రజల్లో ఉంది. ఇప్పుడు… కూడా ఉంది. అలాంటి సందర్భంలో… తాను… జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నానని.. తనకు మద్దతుగా చాలా మంది జాతీయ నేతలు ఉన్నారని.. చంద్రబాబు ఇలా చేతల్లో చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి…ఒక్క కేసీఆర్‌ను మాత్రం హోదాకు మద్దతుగా ఉన్నారని.. ఆయనతో కలసి నడుస్తామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్ని మరింత బాగా చంద్రబాబు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదే సమయంలో.. తెలంగాణలో కేటీఆర్ లాంటి నాయకులు.. చంద్రబాబుకు ప్రచారం చేయడానికి వస్తున్న వారంతా.. తమ కూటమిలోని వారు అని ప్రచారం చేస్తున్నారు. కానీ.. విశాఖలో జరిగిన సభలో.. ఎవరూ కూడా.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌క ఓటు వేయాలని సందేశం ఇవ్వలేదు. యూపీలో అఖిలేష్ , మాయవతి, ఢిల్లీలో కేజ్రీవాల్, తమిళనాడులో డీఎంకే.. ఇలా అందర్నీ గెలిపించమని పిలుపునిచ్చారు కానీ.. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటు వేయమని చెప్పలేదు. పైగా దాని బీజేపీ, దాని మిత్రుల్ని ఓడించండి అని పిలుపునిచ్చారు. అందువల్ల జాతీయంగా చంద్రబాబుకు పలుకుబడి ఉంది. . ఏపీ ప్రయోజనాల్ని సాధించగలరని.. నమ్మకం కలిగిస్తున్నారు.

ప్రత్యేకహోదా విషయంలో అందరి మద్దతు పొందినట్లేనా…?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుభవం చర్చనీయాంశం అయింది. చంద్రబాబు నలబై ఏళ్ల అనుభవాన్ని… ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏపీలో ఇటీవలి కాలంలో.. అన్ని పార్టీల నేతలు.. తమను తాము బ్రాండ్‌ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాయి. జగన్, పవన్ లు మాత్రమే కాదు.. చంద్రబాబు కూడా… ! తానొస్తేనే రాష్ట్రానికి మంచిదని చెబుతున్నారు. తాను చెప్పడమే కాదు… జాతీయ నేతల్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు. దీని వల్ల… చంద్రబాబు రాజకీయ అనుభవం.. ఓ బ్రాండ్‌గా మారుతోంది. ఆంధ్రా బ్రాండ్ చంద్రబాబు అన్నట్లుగా… మారుతోంది. అలా బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి జాతీయ నేతల్ని తీసుకొస్తున్నారు. ప్రత్యేకహోదా ఎవరు ఇస్తారు..? ఇప్పుడు రాహుల్ గాంధీ ఇస్తామన్నారు. కానీ బీజేపీ ఇవ్వబోమని చెప్పేసింది. చంద్రబాబు.. కాంగ్రెస్‌ను దగ్గరవడానికి కూడా కారణం అదే. చంద్రబాబుకు అందరూ మద్దతుగా వస్తున్నారంటే… వారంతా ప్రత్యేకహోదాకు మద్దతిస్తున్నట్లే. వారికేమీ ఇబ్బంది ఉండదు. ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశంలో.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే… పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిషాల నుంచే వస్తాయి. పారిశ్రామిక రాయితీలు వస్తే.. పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్తాయని ఆ రాష్ట్రాల భయం. అందుకే.. టీడీపీకి మద్దతుగా వస్తున్న వారి విషయంలో.. ప్రత్యేకహోదా విషయంలో అభ్యంతరాలు లేనట్లే. ఇలాంటి వాటన్నింటినీ.. జాతీయ నేతల ప్రచారం ద్వారా చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.