చాలా రాష్ట్రాల్లో భాషలతో జరుగుతున్న రాజకీయం బెంగాల్లో మమతా బెనర్జీని కూడా ఆకర్షించింది. బెంగాలీలందర్నీ కలసికట్టుగా ఉంచాలంటే అది కూడా తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉండాలంటే ఖచ్చితంగా భాషా ఆయుధమే మంచిదని డిసైడయ్యారు. బెంగాల్లో బెంగాలీ ఉద్యమం ప్రారంభించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బెంగాలీ భాష మాట్లాడే వలసదారులపై దాడులు , వేధింపులు జరుగుతున్నాయని మమతా ఆరోపిస్తున్నారు. బెంగాలీ గుర్తింపు , భాషను రక్షించడం, బెంగాల్లో ఎన్నికల ఓటరు జాబితా నుండి బెంగాలీ మాట్లాడే వారిని తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆపుతామని మమతా బెనర్జీ అంటున్నారు.
వచ్చే ఏడాది బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా మూడు సార్లు తృణమూల్ విజయం సాధించింది. మొదటి రెండు సార్లు కమ్యూనిస్టులపై గెలవగా..మూడో సారి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. దాదాపుగా గెలిచేసిందని అనుకున్నారు కానీ.. దీదీవైపు విజయం నిలబడింది. ఈ సారి మాత్రం ఎలాంటి అవకాశాల్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. పదిహేనేళ్ల అధికార వ్యతిరేకతను అధిగమించాలంటే ఓ బలమైన భావోద్వేగ ఆయుధం కావాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. అందుకే బెంగాలీ ని అందుకున్నారు.
బెంగాల్లో ఓటరు జాబితా నుండి రోహింగ్యాలు , బంగ్లాదేశీ వలసదారులను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. దీనిని బెంగాలీ గుర్తింపుపై దాడిగా ఆమె చూస్తున్నారు. బెంగాలీ భాషను అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని బెంగాల్‌లోని పేద , అణగారిన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగ పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. బెంగాలీ సెంటిమెంట్‌ను ఉపయోగించి ఓటర్లను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో మరి !