ప‌వ‌న్ సినిమా చేయ‌న‌న్న మ‌మ్ముట్టి

మ‌ల‌యాళంలో సూప‌ర్ స్టార్‌గా ఎదిగాడు మ‌మ్ముట్టి. తెలుగులో స్వాతికిర‌ణం సినిమా చేశాడు. ఆ త‌ర‌వాత‌… నేరుగా ఆయ‌న న‌టించ‌లేదు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో ఆయ‌న‌కు ఛాన్సొచ్చింది. ‘విల‌న్‌గా న‌టిస్తారా?’ అని అడిగారు. కానీ.. ‘నో’ అని చెప్పేశాడు. ఇదంతా ఇప్ప‌టి మాట కాదు. చాలా కాలం క్రితం జ‌రిగిన విష‌యం. దాన్ని అల్లు అర‌వింద్ ఇప్పుడు కొత్త‌గా గుర్తు చేసుకున్నారు. మ‌మ్ముట్టి క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘మ‌మాంగం’ అనే చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు అల్లు అర‌వింద్. ఈ సంద‌ర్భంగా ఒక్క‌సారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు.

”స్వాతికిరణం’ కోసం మమ్ముట్టిని తీసుకున్నప్పుడు.. అదేంటి ఓ మలయాళ నటుడిని తీసుకొస్తున్నారు, తెలుగు ప్రేక్షకులకు ఆయన పాత్ర కనెక్ట్‌ అవుతుందో లేదో అనుకున్నా. నిజానికి అప్పటికి ఆయన అంత పెద్ద నటుడని నాకు తెలియదు. కానీ, ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు కనీసం లేచి నిలబడలేకపోయా. అంత గొప్పగా నటించారాయన. తర్వాత ఓసారి పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ఓ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించా. ఆయనకి ఫోన్‌ చేసి ఇలా ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా అని అడిగా. దానికి ఆయన ‘ఇదే మాట చిరంజీవిని అడుగుతారా’ అని ప్రశ్నించారు. నేను ‘అడగలేను’ అన్నా. దాంతో ఆయన నవ్వుతూ పెట్టేశారు’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు అరవింద్‌. అల్లు అర‌వింద్‌తో ప‌వ‌న్ చేసిన సినిమా ‘జానీ’, ‘జ‌ల్సా’. మ‌రి ఈ రెండిటిలో.. మమ్ముట్టికి ఏ పాత్ర ఆఫ‌ర్ చేశారో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close