మల్టీ స్టారర్ ‘భైరవం’ సినిమా మంచు మనోజ్‌కి కలసిరాలేదు. ఇప్పుడు సోలో ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేశాడు. చాలా రోజుల తర్వాత మంచు నుంచి ఒక సోలో మూవీ సెట్స్‌పైకి వెళుతుంది. ఇదొక హిస్టారికల్ యాక్షన్ డ్రామా. డేవిడ్ రెడ్డి అనే టైటిల్ పెట్టారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడు.
1897–1922 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకున్న ఓ విప్లవ కథ. కులవ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబడి, బ్రిటిష్ పాలనపై ఎదురుతిరిగిన ఓ రెబల్ జీవితం చుట్టూ తిరుగుతుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించే పాత్రలో మనోజ్ కనిపించబోతున్నాడు.
మనోజ్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది. తన కెరీర్లో గ్యాపులు వచ్చాయి. ఫ్యామిలీ సమస్యలు ఇబ్బంది పెట్టాయి. దీంతో హీరో రేసులో వెనుకపడ్డాడు. ‘మిరాయ్’ లో విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు సోలో ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాడు. ఈ రెండు గనక ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటే, మనోజ్ మళ్లీ ట్రాక్ ఎక్కేయడం ఖాయం.