కొంప ముంచిన సాగర్ సభ..!

నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం.. కరోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది. సీఎం కేసీఆర్ సహా… టీఆర్ఎస్ ముఖ్య నేతలందరికీ ఆ సభ ద్వారానే కరోనా సోకినట్లుగా అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన బహిరంగంగా పాల్గొన్న కార్యక్రమం హాలియాలో ఏర్పాటు చేసిన సభ మాత్రమే. దాని ద్వారానే కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్నారు. ఇలా అనుకోవడానికి బలమైన కారణం.. ఆ సభలో పాల్గొన్న వారిలో చాలా మందికి పాజిటివ్ వచ్చింది.

పోలింగ్ ముగిసిన తర్వాత ప్రచారంలో పాల్గొన్న పలు పార్టీల నాయకులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంత మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్ ‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే టిఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య లకి కూడా కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలకూ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. పరిమితంగా ప్రచారం చేస్తున్నా కరోనా కేసులు మాత్రం వందల్లో నమోదవుతున్నాయి.

ఎన్నికల ప్రచారసభల్లో ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించరు. ఎన్నికల సంఘమూ పట్టించుకోదు. ప్రజలకు నీతులు చెప్పే రాజకీయ నేతలూ లైట్ తీసుకుంటారు. ఫలితంగా దేశంలో ఎన్నికల ప్రచారసభలు అలా జరిగిపోతున్నాయి. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోనూ ఎవరూ కరోనా నిబంధనలు పాటించలేదు. ఫలితంగా… కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మిక్కీలో ఇంత మాస్ ఉందా ?

మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ...

ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్

బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ...

టైమ్స్ జాబితాలో హైద‌ర‌బాదీ మ‌నం చాక్లెట్స్

బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అన‌గానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియ‌మ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్ర‌పంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి రైతులు పండించిన కోకోతో...

ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించిన కేసీఆర్ !

ఇక నుంచి నా ఉగ్రరూపం చూస్తారు.. చీల్చిచెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేశారు..ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తానని సంకేతాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close