ప‌వ‌న్ సినిమా… వెంటాడే ప్ర‌శ్న‌లెన్నో?!

ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ కెమెరాముందుకు రావ‌డానికి రెడీ అయ్యాడు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు శుభ‌వార్తే. కానీ.. ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేయ‌డం అంత ఈజీ కాదు. చాలా ప్ర‌శ్న‌ల‌కు, చాలామందికి ఆయ‌న స‌మాధానాలు చెప్పుకోవాల్సి వుంటుంది.

నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ `ఇక సినిమాలు చేసేది లేదు. ప్ర‌జా క్షేత్రంలోనే ఉండిపోతున్నా` అని ప‌వ‌న్ గట్టిగా చెప్పాడు. మీడియాలో కొన్ని వార్త‌లొచ్చినా వాటికి మ‌రుస‌టి రోజే ఖండించి `సినిమాలంటే మూడ్ లేదు` అనే విష‌యాన్ని ప‌దే ప‌దే మ‌న‌సుల్లో నాటుకుపోయేలా చెప్పుకొచ్చాడు. అలాంటిది ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలంటే… ప‌వ‌న్ ప్ర‌త్య‌ర్థులు దాడి చేస్తారు. `రాజ‌కీయాల టైమ్ అయిపోయిందా? సినిమాలకొస్తున్నావు` అని నిల‌దీస్తారు. ప‌వ‌న్ అభిమానులే `మ‌ళ్లీ సినిమాలెందుకు??` అన్న‌ట్టు చూసే ప్ర‌మాదం ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ పొలిటీష‌న్ కాద‌న్న సంకేతాలు జ‌నంలోకి వెళ్తే అది మ‌రింత ప్ర‌మాదం.

అందుకే రీ ఎంట్రీ విష‌యంలో ప‌వ‌న్ చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు. ప‌వ‌న్ చుట్టూ ఇప్పుడు బోలెడంత మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు. వాళ్ల‌లో ఎవ‌రి సినిమా ఓకే చేయాల‌నే విష‌యంలో ప‌వ‌న్ ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేదు. క్రిష్‌తో ప‌వ‌న్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లొచ్చినా – ఆ సినిమా విష‌యంలోనూ ఎలాంటి క్లారిటీ లేదు. ప‌వ‌న్ కోసం క‌థ‌లు సిద్ధం చేసుకుంటున్న ద‌ర్శ‌కుల‌లో క్రిష్ ఒక‌రు అంతే. ఈ క‌థ‌ల్లో ప‌వ‌న్ దేనికి ఓటేస్తాడ‌న్న‌ది పూర్తిగా ప‌వ‌న్ ఛాయిస్‌.

పైగా ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాల‌న్న విష‌యంలో ప‌వ‌న్ లోలోన చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్టు తెల‌స్తోంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తే ఓర‌క‌మైన మైలేజీ, సామాజిక బాధ్య‌త ఉన్న సినిమాలు చేస్తే మ‌రో ర‌క‌మైన ప్ల‌స్‌. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ అయిన నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌యోగాలు చేయ‌లేడు. అలాగ‌ని డాన్సులు, ఫైటింగులు చేస్తే – ఇప్పుడున్న ఇమేజ్‌కి అతుకుతుందా, లేదా? అనేది మ‌రో డౌటు. రీమేక్ క‌థ‌లు చేసి సేఫ్ జోన‌ర్‌ని వెదుక్కుంటే ఎలా ఉంటుందా? అనేది ఇంకో ఆలోచ‌న‌. ఇలా… ప‌వ‌న్ ఇప్పుడు చాలా విష‌యాల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

పైగా… త‌న నుంచి ప్ర‌క‌టన వ‌చ్చేంత వ‌ర‌కూ ఎవ‌రూ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయొద్ద‌ని ప‌వ‌న్ గట్టిగా చెప్పాడ‌ట‌. ఇది వ‌ర‌కు ఇలానే ఓ నిర్మాత తొంద‌ర‌ప‌డి ప‌వ‌న్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి మీడియాకు లీక్ చేశాడు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇలానే ఎవ‌రైనా తొంద‌ర‌ప‌డితే… ఆ సినిమాలూ ఆగిపోతాయ‌ని ప‌వ‌న్ గ‌ట్టిగా చెప్ప‌డంతో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ కామ్ అయిపోయారు. రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాని స‌రైన టైమ్‌లో, స‌రైన వేదిక‌పై ప్ర‌క‌టించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌దీ అదే వేదిక‌పై ప‌వన్ ప్ర‌క‌టిస్తాడు. అప్ప‌టి వ‌ర‌కూ.. అంద‌రూ గ‌ప్ చుప్‌. అంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...
video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close