టీఆర్ఎస్‌పై ఓ రేంజ్ మైండ్ గేమ్..! అరడజను మంది క్యూలో ఉన్నారా..?

రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితి.. ఓ ఇరకాటంలో పెట్టేశారు. రెండు కాదు మూడు వికెట్లు అంటూ సంఖ్య పెంచుచుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి మాటలు ఆషామాషీ కాదని.. జోరుగా ప్రచారం జరుగుతోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేసం అయిన వెంటనే.. తెలంగాణలో.. ఇక నెక్ట్స్ ఎవరు అన్న చర్చ ఓ రేంజ్‌లో సాగడం ప్రారంభమయింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం… కాంగ్రెస్ లో కన్నా.. టీఆర్ఎస్ లోనే ఎక్కువ కలకలం రేపింది. తమ రాజకీయ భవిష్యత్ పై ఆలోచన చేస్తున్న పలువురు ఎంపీలు… దీనిపై లోతుగా పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో చాలా మంది.. కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలతో టచ్ లో ఉండటం వల్లే… నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి.

చేవేళ్లను ఆనుకుని ఉండే.. నియోజకవర్గానికి చెందిన.. ఓ ఎంపీ చాలా రోజులుగా.. టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఆయన అవడానికి తెలంగాణ వ్యక్తే కానీ… తెలుగు కూడా సరిగ్గా రాదు. ఆయన గతంలోనే పార్టీ మారుతారని ప్రచారం జరగింది. తర్వాత సైలెంటయిపోయారు. అలాగే.. ఇటీవలే.. కేంద్ర దర్యాప్తు సంస్థ వలలో పడిన.. మరో ఎంపీ కూడా.. రెడీ అవుతున్నారని చెబుతున్నారు. అసలు ఆ ఎంపీ.. ఓ మంత్రిపై… అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. చివరి క్షణంలో దర్యాప్తు సంస్థ సోదాలతో వెనక్కి తగ్గారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్న జిల్లాకు చెందిన ఎంపీ కూడా.. అదే బాటలో ఉన్నారని.. తన పాత పరిచయాలతో… రంగంలోకి దిగారంటున్నారు. ఆయన జీవితాశయం మంత్రి కావడం. ఇప్పుడు పోటీ కి చాన్స్ రాకపోవడంతో.. తన కలలు కల్లలయినట్లే. అందుకే… వచ్చిన చోటకే పోదామనుకుంటున్నారట. ఇప్పటికే సీతారామ్ నాయక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయనకు బదులుగా లక్ష్మణ్ నాయక్ అనే కేరళ క్యాడర్ ఐపీఎస్‌కు… ఎంపీ టిక్కెట్ ఇస్తున్నారని కూడా చెబుతున్నారు. ఆయన సీతారామ్ నాయక్ ఖండిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఐదారుగురు ఎంపీలు రెడీగా ఉన్నారని.. అందర్నీ డిసెంబర్ ఏడు లోపు… కాంగ్రెస్ పార్టీలో చేర్చేస్తామని… ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. అయితే.. ఇదంతా కాంగ్రెస్ మైండ్ గేమ్ అనే వాళ్లు లేకపోలేదు. ఎందుకంటే.. టీఆర్ఎస్‌లో ఎంపీలకు కనీస గౌరవం దక్కడం లేదు. వారు అసంతృప్తిలో ఉన్నారు. వారందర్నీ.. పార్టీలో చేర్చుకోవడం వల్ల.. ఆయా ఎంపీలు ఉన్న నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభావం పడుతుంది. అందుకే… కాంగ్రెస్ పార్టీ కూడా.. ఎంపీల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మైండ్ గేమ్ ప్రారంభించింది. మైండ్ గేమ్ లో ఇరుక్కున్న వాళ్లు కాంగ్రెస్‌లో చేరిపోతారు. లేకపోతే…టీఆర్ఎస్‌లోనే ఉంటారు. అంతే తేడా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేరళ ఎయిర్‌పోర్టులో విమానం రెండు ముక్కలు..!

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది....

రికవరీ తక్కువ.. మృతులు ఎక్కువ..! ఏపీలో “డెడ్లీ” కరోనా..!

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన...

మూడు నెలల్లో కొత్త జిల్లాల విభజన సిఫార్సులు..!

మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల సందడి ప్రారంభమవనుంది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు..రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు...

జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో... ...

HOT NEWS

[X] Close
[X] Close