ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్న మారుతి

`ప్ర‌తిరోజూ పండ‌గే`తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు మారుతి. సాయిధర‌మ్ తేజ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌. దాంతో మారుతి త‌దుప‌రి సినిమాపై మ‌రింత ఫోక‌స్ ప‌డింది. ర‌వితేజ‌, రామ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌… ఇలా చాలామంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. చివ‌రికి రామ్‌తో మారుతి సినిమా ప‌క్కా అయ్యింద‌ని వార్త‌లొచ్చాయి. అందుకు సంబంధించిన ప‌నుల్లో మారుతి బిజీగా ఉన్నాడ‌ని చెప్పుకున్నారు. అయితే ఈ కాంబినేష‌న్‌పై వ‌స్తున్న వార్త‌ల్ని మారుతి ఖండించారు. తన త‌దుప‌రి సినిమాకి సంబంధించి వ‌చ్చిన వార్త‌లేవీ నిజం కావ‌ని, ఏ హీరోతోనూ తాను క‌మిట్ కాలేద‌ని, ఇంకా స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, అన్నీ పూర్త‌య్యాక తానే హీరో ఎవ‌ర‌న్న‌ది చెబుతాన‌ని, ఈ ఒక్క న్యూసే నిజ‌మ‌ని, మిగిలిన‌వి న‌మ్మొద్ద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. సో.. మారుతి హీరోల వేట ఇంకా కొన‌సాగుతూనే ఉంద‌న్న‌మాట‌. హీరో దొర‌కాలంటే ముందు క‌థ పూర్త‌వ్వాలి. ఆ త‌ర‌వాతే… మిగిలిన‌వన్నీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ సర్కార్ కంటే ముందుగానే సుప్రీంకోర్టుకు విపక్షాలు..!

ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. పలువురు నేతలు ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. దీంతో ఒక వేళ ఏపీ సర్కార్...

ఏడాదిలో రూ. 40వేల కోట్ల పంపిణీ : జగన్

మేనిఫెస్టోలో మొత్తం 129 హామీలు ఇచ్చామని... ఇప్పటికే 77 అమలు చేసేశామని.. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంటే 90 శాతంపూర్తి చేసినట్లన్నారు....

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

HOT NEWS

[X] Close
[X] Close