అఫీషియ‌ల్: గోపీచంద్ తో మారుతి

ప్ర‌తిరోజూ పండ‌గే త‌ర‌వాత‌… మారుతి సినిమా ఏది? అనే విష‌యంపై విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రిగింది.ర‌క‌ర‌కాల వార్త‌లొచ్చాయి. హీరోలు మారారు. కొత్త కొత్త‌ టైటిళ్లూ వినిపించాయి. వాట‌న్నింటికీ పుల్ స్టాప్ పెట్టేశారు మారుతి. త‌న కొత్త సినిమా వివ‌రాల్ని వినూత్నంగా ప్ర‌క‌టించారు. గోపీచంద్ తో ఆయ‌న సినిమా ఖాయ‌మైంది. యూవీ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని విడుద‌ల చేశారు. ఈ వీడియోకి.. ప్ర‌ముఖ న‌టుడు రావు ర‌మేష్ వాయిస్ అందించారు. త‌న సినిమా పై వ‌చ్చిన ర‌క‌ర‌కాల పుకార్ల నేప‌థ్యాన్ని జోడిస్తూ.. `ర‌క‌ర‌కాల వార్త‌ల‌తో తాను తీయ‌బోని సినిమాని మారుతితో తీయించేశార‌ని కోర్టువారు న‌మ్మ‌డం జ‌రిగింది..“ అంటూ మారుతి సినిమాని ఖ‌రారు చేసేశారు. ఫ‌స్ట్ లుక్ తో పాటు, టైటిల్ నీ ఒకే సారి విడుద‌ల చేయ‌బోతున్నాడు. బ‌హుశా.. సంక్రాంతికి ఈ క‌బురు విన‌వొచ్చు. ఈ చిత్రానికి `పక్కా క‌మ‌ర్షియ‌ల్` అనే పేరు పెట్టార‌ని స‌మాచారం. అదే ఉంటుందా? లేదంటే మారుతుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close