ర‌వితేజ వెంట ప‌డుతున్న మారుతి

ర‌వితేజ తో ఓ సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడు మారుతి. యూవీ, గీతా ఆర్ట్స్‌క‌లిసి ఈ సినిమాని నిర్మించాల‌ని ముందుకొచ్చాయి. అయితే,.. పారితోషికం విష‌యంలో పేచీ రావ‌డంతో ర‌వితేజ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ర‌వితేజ డిమాండ్ చేసినంత పారితోషికం ఇవ్వ‌డానికి ఇష్టం లేక‌, నిర్మాత‌లూ లైట్ తీసుకున్నారు. ర‌వితేజ డ్రాప్ అవ్వ‌డంతో గోపీచంద్ లైన్ లోకి వ‌చ్చాడు.

అయితే… మారుతి దృష్టి ఇప్ప‌టికీ ర‌వితేజ‌పైనే ఉంది. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` అనే టైటిల్ కీ, తాను రాసుకున్న క‌థ‌కూ… ర‌వితేజ‌నే యాప్ట్ అని ఇప్ప‌టికీ న‌మ్ముతున్నాడు. అందుకే ర‌వితేజ‌ని ఒప్పించే ప్ర‌య‌త్నాలు మ‌ళ్లీ మొద‌లెట్టాడ‌ని టాక్‌. కావాలంటే త‌న పారితోషికం కొంత త‌గ్గించుకుని, అది కాస్త‌.. ర‌వితేజ పారితోషికంలో క‌ల‌ప‌డానికి సైతం సిద్ధ‌మ‌య్యాడు. అయితే.. ర‌వితేజ మాత్రం `12` కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయాడు. మారుతి త‌న పారితోషికం విష‌యంలో కాస్త దిగి వచ్చినా, ర‌వితేజ‌కు కావ‌ల్సినంత మాత్రం స‌ర్దుబాటు కావ‌డం లేదు. త‌న‌కు ర‌వితేజ కావాల‌ని మారుతి ఎలా త‌పిస్తున్నాడో, త‌న‌కు మారుతి కావాల‌ని ర‌వితేజ కూడా కాస్త అనుకుంటే.. ఈ ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అవుతుంది. లేదంటే ప్లాన్ బి…(గోపీచంద్‌తో) ఎలానూ ఉంది. మ‌రో వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close