మీడియా వాచ్ : నెంబర్ 1 పేరుతో పరువు తీసుకుంటున్న చానళ్లు !

గత వారం తాము నెంబర్ వన్ అయ్యామంటూ.. టీవీ9 బృందం .. స్క్రీన్ మీదకు వచ్చి చేసిన హడావుడి తర్వాత.. చాలా మందికి వచ్చిన సందేహం ఒక్కటే.. అదేమిటటి.. టీవీ9 ఇప్పటి వరకూ నెంబర్ వన్ కాదా..? అని. నిజానికి సాధారణ ప్రేక్షకులకు ఏది నెంబర్ అనే పట్టింపు ఉండదు. ఈ టీఆర్పీల గోల అంతా చానళ్ల అంతర్గత వ్యవహారం. రేటింగ్ లు ఎక్కువ వస్తే ఎక్కువ యాడ్స్ వస్తాయి. అది వారు చూసుకోవాల్సింది. కానీ జనాలు తమకు ఏ చానల్ నచ్చితే అది చూస్తారు.

టీవ చానళ్లుఈ విషయాన్ని మర్చిపోయి.. తామే నెంబర్ వన్ ప్రజల ముందు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వచ్చిందంటే.. ఎక్కువ మంది ముందుగా టీవీ9 ప్రిఫర్ చేస్తారు. ఇటీవలి కాలంలో పొలిటికల్ బ్రేకింగ్ ల పరంగా.,.. వైసీపీకి వ్యతిరేక వార్తలయితే ఏబీఎన్ , టీవీ ఫైవ్, టీడీపీ వ్యతిరేక వార్తలయితే సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వంటి చానళ్లను వర్గీకరించుకుంటున్నారు. ఇతర న్యూస్ అయితే టీవీ9నే చూస్తున్నారు. ఎలా చూసినా ఫస్ట్ ఫ్రిపరెన్స్ టీవీ9 ఉంటుంది. కానీ బార్క్ రేటింగ్ లలో ఎన్టీవీ మొదట ఉంటోంది. ఆ రేటింగ్ లు ఎలా వస్తున్నాయో కానీ .. ఇద్దరూ ఇప్పుడు తామంటే తాము అని.. రోడ్డున పడుతున్నాయి.

ఇటీవల టీవీ9 అతి చేసి ఒక్క వారం.. ఒక్క పాయింట్ ముందు వచ్చినదుకే హంగామా చేశారు. రోడ్లపై పోస్టర్లువేశాు. తీరా చూస్తే ఒక్క వారానికే అదీ కూడా చాలా పన్నెండు పాయింట్ల తేడాతో టీవీ9 వెనుకబడిపోయింది. వారానికోసారి మారిపోయే రేటింగ్ ను చూపించి టీవీ9 సంబారాలు చేసుకుని వారంలో టీవీ9 తలదించుకోవాల్సి వచ్చింది. ఎన్టీవీ కౌంటర్లు వేస్తోంది. అయితే ఈ మీడియా రచ్చ జనానికి అవసరం లేదు. కానీ వీరు దీన్ని కూడా స్క్రీన్ మీదకు తెస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలుపులు బద్దలు కొట్టి బండారుకు నోటీసులిచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సినిమా స్టైల్ సీన్లు పండించడంలో రాటుదేలిపోతున్నరు. లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపి ఢిల్లీలో షో చేశారు. కానీ నారాయణకు మాత్రం వాట్సాప్‌లో పంపి చేతులు...

ఎవరీ జితేందర్‌ రెడ్డి ?!

ప్రీలుక్ టీజర్ తో క్యురియాసిటీని పెంచింది జితేందర్‌ రెడ్డి. ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే టైటిల్‌ రోల్‌లో...

రాజధాని రైతుల కౌలూ నిలిపివేత – ఉసురు తగలదా !?

రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు. చివరికి కౌలు...

చంద్రబాబుకు గాంధీ మార్గంలో ప్రజల బాసట !

లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి కనీస ఆధారం లేకపోయినా పాతిక రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రజలు గాంధీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close