కరోనా మళ్లీ పెరుగుతోందంటే రెండు, మూడు రోజులుగా అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. వాటిని పట్టుకుని గుడ్డెద్దు చేలో పడినట్లుగా సోషల్ మీడియాలో కొంత మంది మళ్లీ కరోనా వస్తుందని ప్రచారం ప్రారంభించారు. ఇదిగో అన్ని కేసులు.. ఇదిగో ఇన్ని కేసులు అని అప్ డేట్స్ ప్రారంభించారు. కొత్త కొత్త వేరియంట్ల పేరుతో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా అప్పుడప్పుడూ జరుగుతున్నదే. మెడికల్ మాఫియా డబ్బు పిండాలనుకున్నప్పుడల్లా ఇలాంటి ప్రచారం ప్రారంభమవుతుంది.
జలుబు, జ్వరం లాంటి సాధారణ వైరస్ గా మారిన కరోనా
కరోనా అనే దానికి మందు లేదు. పూర్తిగా జలుబు, జ్వరం లక్షణాలతో ఉంటుంది. వాటికి ఉపయోగిచే మందులతోనే తగ్గిపోంది. కానీ కరోనా వస్తే ఏదో జరిగిపోతుందన్న భయం పుట్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేశారు. అసలు కరోనా వల్ల చనిపోయిన వారి కన్నా.. కరోనా అనే భయంతో చనిపోయిన వారే ఎక్కువ. ఇతర తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు కరోనా ప్రభావం చూపింది . తర్వాత అది బలహీనం అయింది. అది ఇప్పుడు జలుబుతో సమానంగా మారింది.కానీ కొత్త వేరియంట్ల పేరుతో ఎప్పటికప్పుడు హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏడాదికోసారి మళ్లీ కరోనా అంటూ హడావుడి
కరోనా అనే ప్రచారం మొదట చైనా నుంచి వస్తుంది. అక్కడి ప్రజలు మాస్కులేసుకుంటున్నారని.. వందల మంది ఆస్పత్రుల్లో చనిపోతున్నారని ప్రచారం చేస్తారు. కానీ అక్కడ అంతేమీ ఉండదు. ఇప్పుడు సింగపూర్, యూరప్, అమెరికాల్లో కేసులు పెరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆయా దేశాల్లో కరోనా వచ్చినప్పటి నుండి కరోనా టెస్టులు చేస్తున్నారు పాజిటివ్ వచ్చిన వారికి మామూలు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ.. భయపెట్టేలా ప్రచారాలు చేసి వారి వారి ప్రజల్ని గందరగోళానికి గురి చేయడం లేదు.
మెడికల్ మాఫియా కుట్రల్లో భాగంగానే కరోనా అలజడి !
కరోనా పేరుతో ఒక్క సారి ప్రజల్ని భయపెడితే లక్షల కోట్ల వ్యాపారం మెడికల్ రంగంలో జరుగుతుంది. ఫేస్ మాస్కుల నుంచి వ్యాక్సిన్ల వరకూ ఈ మాఫియా విస్తరించి ఉంటుంది. ప్రజల్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా సాగే ప్రచారాలతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనవసర భయాందోళనలకు గురి కావడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వాటి కోసమే వారు చేసే ప్రచారాలు. కరోనా.. కోవిడ్ అనేది ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.